తొలినాళ్ల శివ లింగం కనిపించింది రాయలసీమలోనే...

 
Published : Sep 11, 2017, 03:01 PM ISTUpdated : Mar 28, 2018, 04:58 PM IST
తొలినాళ్ల శివ లింగం కనిపించింది రాయలసీమలోనే...

సారాంశం

 

ఒక ప్రాంతపు విలువలను,ఔన్నత్యాన్ని,సున్నితత్వాన్ని, ఆ ప్రాంత ప్రజల మనస్తత్వాన్ని ప్రతిబింబించే నిర్మాణాలు ఆలయాలే.

ఆధ్యాత్మిక ప్రవాహపు పరవళ్లు  ఒక ప్రాంత జీవితపు అంతరంగాన్ని తెలుపుతాయి. రాయలసీమ విషయంలోకూడా ఇదే సత్యం. గొప్ప చారిత్రక సంపదకు నిలయం రాయలసీమ. ఇక్కడి గుడుల, గోపురాల,ప్రాకారాల,విశిష్ట నిర్మాణాల(కోటలు, రాజ్య ప్రాసాధాల) రూపంలో రాయలసీమ వ్యక్తిత్యం ప్రత్యక్షమవుతూ ఉంటుంది. భారత దేశంలోని మొదటి శివలింగం గుడిమల్లం లోనిదే  అని చెబుతారు.పురాణాల ప్రస్తావనలు,  చారిత్రక ఆధారాలను బట్టి క్రీస్తు పూర్వం 2 లేదా 3 వ శతాబ్దం లో నిర్మించబడిన ఏక శిలా శివలింగం ఉన్న ఊరుగా  గుడిమల్లంకు పేరుంది.

ఈ ఆలయాన్ని శాతవాహనులు నిర్మించారని కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం.ఎదయితేనేం రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో,తిరుపతి, రేణిగుంటకు అతి సమీపంలో (20కి.మీ ) దూరంలో ఈ  అపురూప దివ్య క్షేత్రం నెలకొని ఉంది...

 

5 అడుగుల ఎత్తు, 1 అడుగు మందంతో కాఫీ-నలుపు వర్ణంలో  పురుషాంగ  రూపంలో ఇక్కడి  లింగం ఉంటుంది, ఆకాలపు శైవారాధనకుఒక ఉదాహరణగా కూడాదీనిని గుర్తిస్తారు. శివుడు ఈ రూపంలో ఎక్కడా కనిపించడేమో. పురుషాంగంగా పోలి ఉండుటకు కారణం:

అప్పట్లో ప్రజలు దేవుడు అంటే ప్రకృతి అనే అర్థంలో చూసేవారు అందులో భాగంగానే హిందూమతం లో అగ్నిని,నీటిని,భూమిని, వాయువును, పూజించారు.  పురుషాంగం రూపంలోశివుడు కనిపించడం లింగోద్భవ శైవారాధనకు చిహ్నమని చరిత్రకారులు చెబుతున్నారు.

భయం ఆధారంగా ఉండేది భక్తి.ఇంకా  ప్రకృతి అంటే ఏమిటో తెలుసుకొని పూజించాలను కున్న పూర్వీకులు మానవునిలో సృష్టికి కార్యాన్ని   ప్రేరేపిస్తున్న జనంగాలను  పూజించడం మొదలయింది. అన్ని సంస్కృతులలో ఇది ఏదో ఒక రూపంలో ఉంది. పైన చెప్పిన అంశానికి గుడిమల్లం శివలింగం ఒక సాక్షం. ఇంతటి చారిత్రక సంపద కలిగిన ఈ ఆలయాన్ని 1954 లో భారత పురావస్తు శాఖ అధీనం లోకి తీసుకున్నారు అప్పటి నుండి 2009 వరకు పురావస్తు శాఖ అధీనం లో ఉండింది...

 

అయితే పురావస్తు శాఖ వారు 55 సంవత్సరాలలో పరిశోధించింది సున్నా.  పైగా ఆలయానికి సంబంధించిన గ్రంధాలు కూడా లేకుండా చేశారు. 1954 నుండి 2009 వరకు శివునికి పూజలు జరుగకుండా చేశారు. 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టం ఆధారంగా గుణశేఖర్ అనే వ్యక్తి సమాచార హక్కు పిటేషన్ తో గ్రామస్తులకు గుడిలో పూజలు నిర్వహించుకునే హక్కును 2009 నుండి కల్పించారు.

ఈ గుడి గొప్పతనo ఏంటంటే ఈ గుడిలోని లింగాన్ని ఆధారంగా చేసుకొని ఉజ్జయిని, మధుర లో నాణేలను ముద్రించటం జరిగిందని పురావస్తు ఆధారాలతో తెలుస్తోంది.

 

ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, ఎప్పుడో క్రీస్తు పూర్వమే అనగా 2, 3 శతాబ్దాలలోనే రాయలసీమ ఖ్యాతి దేశం నలుమూలలా విస్తరించింది. అయినప్పటికీ ఈ గుడిని ఎవరు కట్టించారనే విషయం లో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియడం లేదు.

 

అందుకే రాయలసీమ ఘనచరిత్రను ఆధారాలతో సహా కనిపెట్టి సీమ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి.

ఇంకా గుడి మల్లం గురించి తెలుసుకోవాలంటే ఇంగువ కార్తికేయ శర్మ రాసిన,"Parameswara temple at Gudimallam", "Development of early Shiva art and architecture" అనే ఈ రెండు పుస్తకాలు చదవండి.....

 

PREV
click me!

Recommended Stories

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?