అమరావతి రాజధానా లేక బాహుబలి-3 సెట్టా...

 |  First Published Sep 14, 2017, 5:01 PM IST

అమరావతి నూతన రాజధాని... చంద్రబాబు అన్న పేరు నేడు రాజమౌళి గా మారుతుంది. మొదటి నుంచి రాజధాని నిర్మాణం వివాదాల నడుమ సాగుతూ ఉంది. ఇప్పటికే బాబుగారి నుంచి ప్రధాని, కేంద్రమంత్రులు దాకా దఫ, దఫాలుగా శంఖు స్థాపనలు జరిగిన రాజధాని విజయదశమికి మరోమారు శంఖుస్దాపనకు సిద్దమైంది. దానికి సంబందించిన డిజైన్ లు ముఖమంత్రికి నచ్చ లేదు. తాజాగా వచ్చిన డిజైన్ లలో మార్పులు చేపట్టాలని బావించిన బాబుగారు అందుకు బాహుబలి దర్శకుడు రాజమౌళి సహకారం తీసుకోవాలని, అవసరమైతే లండన్ కు కూడా వారిని వెంటతీసుకు వెళ్లాలని ఆదేశాలు జారీచేసినారు.

రాజదాని అన్నది ఒక రాష్ట్రానికి సంబందించిన పరిపాల కేంద్రం మాత్రమే. అమెరికా లాంటి దేశాలు సైతం రాజదానులను కేవలం పరిపాలన కేంద్రాలుగా మాత్రమే చూస్తున్నారు మిగిలిన ఉపాధి, వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాలుగా మాత్రం మరో ప్రాంతాలను ఎంచుకుంటున్నాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ సీ ని ఎంపిక చేసే నాటికి న్యూయార్క్ నగరం అందుబాటులో ఉంది.కాని దూరదృష్టి గల నేతలు రాజధాని కేవలం పరిపాలన కేంద్రంగా మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో వాషింగ్టన్ డీ సీ ని ఎంచుకున్నారు. ఈ మధ్య కాలంలో అనేక ప్రపంచ దేశాలు పర్యావరణంలో వస్తున్న విపరీత మార్పుల నేపధ్యంలో పెద్ద నగరాల నిర్మాణం చేయడంలేదు. అంతే కాదు నదీపరివాహ ప్రాంతాలలో నూతన నగర నిర్మాణాలకు సిద్దపడటంలేదు. కాని మన బాబుగారు మాత్రం నది ఒడ్డునే రాజదాని నిర్మాణానికి సిద్దపడ్డారు. అదేమి అంటే చెన్నై, బాంబే, కొలకత్తా లను ఉదహరిస్తున్నారు. కానీ నాడు ఆంగ్లేయులు వాటిని ఎంచుకోవడానికి కారణం మన దేశంలోని ముడిసరుకులను వారి దేశానికి తీసుకెల్లి మరలా ఉత్పత్తి అయిన వస్తువులను మనకు అమ్మడానికి అనువుగా నౌకాయానానికి  అందుబాటులో ఉండేవిదంగా నగరాలను నిర్మించారు. ఒక్కమాటలో చెప్పాలంటే వారి వ్యాపార ప్రయోజనాల ప్రాతిపదికన వారి నిర్మాణాలు జరిగినాయి. మరి మనం ఏ ప్రాతిపదికన నగరాలను నిర్మించాలి?

Latest Videos

undefined

అమరావతి వరద ముంపుకు అవకాశం ఉందని కేంద్రం నియమించిన శివరామక్రష్ణన్ నివేదించారు. కాని వారి నివేదికను అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ పట్టించుకోలేదు. పోని బాబుగారు అయిన ఒక కమిటి వేసి నగరం ఎంపిక, విధి,విదానాలు రూపొందించారా అంటే కేవలం రాజకీయ నిర్ణయంగా కొన్ని రోజులవ్యవధి లోనే తీసుకున్నారు. మొదట వరద ముంపు లేదని దబాయించి ఇపుడు ఏకంగా నగరం వంగవీటివాగు పొంగితే నివారించడానికి ఏకంగా ఒక ఎత్తిపోతల పధకాన్నే నిర్మిస్తున్నారు. ఎత్తిపోతల పధకం ఉన్న ఏకైక నగరం ప్రపంచంలో ఒక్క అమరావతి మాత్రమే. అంతే కాదు రాజధాని అవసరాల కోసం డీపారెస్ట్  చేయాలని కేంద్రాన్ని కోరగా క్రిష్ణా, గుంటూరు జిల్లాలలో అడవుల సగటు కన్నా తక్కువగా ఉన్నాయని మళ్లీ అదే ప్రాంతంలో డీపారెస్ట్ కుదరదని చెపితే రాయలసీమలో అడువులు పెంచుతాం అనుమతి ఇవ్వాల్సిందే అంటూ మొండిగా వ్యవహరించారు. అనుమతి తెచ్చుకున్నారు.

విభజన చట్టం ప్రకారం ఏపి రాజధానికి మౌళిక వసతులు, రాజ్ భవన్, సచివాలయం, అసెంభ్లీ లాంటి నిర్మాణాలను కేంద్రం నిర్మాణం చేయాలి. అలా చేస్తే ఆర్దిక ఇబ్బందులలో ఉన్న ఏపికి లాభం కూడా. కాని బాబుగారు 10 ఏళ్ల హైదరాబాదు హక్కును సైతం వదులుకుని తాత్కాలిక నిర్మాణాల పేరుతో కోట్ల రూపాయిలు వెచ్చించి నిర్మాణాలు చేపడుతున్నారు. కేంద్రం సహకారం లేకుండా ముందుకు వెళితే అన్ని విధాలా నష్టపోయేది ప్రజలు మాత్రమే. ప్రపంచంలోని ఏ నగరం అయినా పూర్తి స్దాయిలో నిర్మాణం జరగడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. ఉదాహరణకు  వాషింగ్ టన్ డీ సీ ఈ నాటి స్దాయికి చేరుకోవడానికి 100 సంవత్సరాలు పట్టింది. కాని బాబుగారు మాత్రం మొత్తం రాజదాని ఎలా ఉండాలో తానే నిర్ణయిస్తున్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించుకోలేరు. అలాంటిది బాబుగారు మొత్తం రాజధాని ఇలానే ఉండాలని అందుకు డిజైన్ లను కోరుతున్నారు అందుకు అవసరం అయ్యే వ్యయం, చట్టాలు ఖజానాను నుంచి చెల్లించేస్తున్నారు.ఫలితంగా వ్యవహరం గందరగోళగా మారుతుంది. తాను వెళ్లి వచ్చిన ప్రతి దేశం నమూనాతో రాజధాని నిర్మాణం అంటూ ప్రకటనలు చేస్తున్నారు.  తాను ఒక దేశంలోని చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేదా దేశం మొత్తానికి ప్రతినిధియా అర్దం కావడంలేదు. ప్రజలు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగా మొదట్లో రాజదానిని ఆత్మగౌరవంగా భావిస్తే నేడు అమరావతిని ఒక సినిమా సెట్ లాగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే బాహుబలి సృష్టికర్త రాజమౌళి సహకారంతో డిజైన్ ఎంపిక చేయమనడంతో ప్రజలకు ప్రభుత్వ పై చులకన బావం ఏర్పడుతుంది.

 

(* రచయిత ఆంధ్రప్రదేశ్ లో పేరున్న రాజకీయ విశ్లేషకుడు)

click me!