నంద్యాల ఎన్నికల్లో అసలేం జరిగింది ? పోస్టుమార్టమ్-1

 |  First Published Sep 3, 2017, 1:14 PM IST

కత్తెరకు పని చెప్పేవాళ్లు మనకు నలుగురు కనిపిస్తారు..ముగ్గురిని మాత్రం అనుభవజ్ఞులను ఎంచుకోవాలి...సర్జన్,టైలర్,క్షురకుడు...ఇక నాలుగో కత్తెర , జేబులు కొట్టేవాడిది. ఇందులో మన ప్రమేయమేమీ ఉండదు.

 సరే చాలారోజులైందని మా బార్బర్ శ్రీరాములు దగ్గరికెళ్లా నిన్న సాయంత్రం... అంటే శుక్రవారం సాయంత్రం .ఆ రోజు,టైం కూ వెళ్లడానికో కారణం ఉంది...సినిమాలు జనాల భావాలను ఎలా ప్రతిబింబిస్తాయో,వాటి ప్రభావం జనాల మీదో ఎలా ఉంటుందో అన్నది పెద్ద చర్చ...అప్పట్లో "లక్ష్మికటాక్షం" అనే సినిమాలో సంపద పెంపు గురించి "శుక్రవారపు పొద్దు సిరిని విడవొద్దు" అంటూ పద్యం ఉంటుంది..ఇది జనాల్లో ఉన్నదో, దాని ప్రభావం జనాల మీద పడిందో  తెలియదు...శుక్రవారం డబ్బు ఖర్చు చేయాలంటే గింజుకు చస్తారు...ఇది వన్ వే మాత్రమే..అదే డబ్బో,వస్తువో వస్తుందంటే ఆబగా రెండు చేతులతో లాక్కుంటాం...ఇప్పుడిదంతా ఎందుకా అనుకుంటున్నారా?అసలే శుక్రవారం అందులో జుట్టు కత్తరించుకోవడం..అమ్మో అమ్మో అంటారు సాంప్రదాయవాదులు. కానీ నేను మాత్రం నంద్యాల ఎన్నికల ఫలితాల పోస్ట్ మార్టం రిపోర్ట్ లో భాగంగా, ఆ సమయంలో సెలూన్ కు వెళ్లా...ఎవరూ ఉండరు కదా అని, మా శ్రీరాములు మనసు విప్పి విశేషాలు చెబుతాడని. అసలు ఈ సెలూన్లలోనే కదా నానారకాల తలలు,వాటి లోపలి తలపులూ తెలిసేది! నేను పోయేసరికి శ్రీరాములు లేడు..అనుభవజ్ఞులను ఎంచుకోవాలన్న సూత్రాన్ని అనుసరించి ఇంటికి వచ్చాను.ఒక గంట తర్వాత శ్రీరాములు ఫోన్ చేసాడు, రమ్మని. "ఏమయ్యా ఇంత ఆల్స్యంగా వచ్చావు?ఇందాక ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ ఉంది"అని అడిగా.. "ఏం చెప్పను సార్, ఆ నొస్సం(కర్నూల్-కడప జిల్లాల సరిహద్దు)నుంచి మరదలు కొట్లాటకు వచ్చింది" "ఎవరు?శేఖర్ భార్యా?ఎవరిది వాళ్లు పంచేసుకున్నారుకదా!మళ్లీ ఏమొచ్చింది?"....(శేఖర్ శ్రీరాములు తమ్ముడు..అన్నదమ్ములిద్దరూ కలిసి ఉండేవాళ్లు..ఈ మధ్యే విడిపోయారు)... "ఏమొచ్చింది ఏమి సార్, ఎలక్షన్లొచ్చాయి కదా" "అయితే దానికీ మీ గొడవకూ సంబంధమేముంది?"

Latest Videos

undefined

"మొన్న ఒక పార్టీ 1000,మరొకరు 2000 ఇచ్చారు...వాళ్లిద్దరివి కలిపి 6000 మేము కొట్టేసామని అనుమానం...అసలు ఆ డబ్బు మామూలుగా ఇచ్చారా? ఆ అంగన్‌వాడి వాళ్లు పంచిన ఓటర్ స్లిప్స్ చూసి ఇచ్చారు.అంతకుముందే ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారని కనుక్కుని వెళ్లారు...మా వాడు లేడని చెబితే ఈ అంగన్‌వాడి స్లిప్ తీసుకుని ఓటింగ్రోజు రమ్మనండి,బూత్‌కు దగ్గర్లో మేముంటాము...స్లిప్ చూపిస్తే 2000 ఇస్తామన్నారు..కానీ వాడు వచ్చిందెక్కడా?పైగా మేము కొట్టేసామని అనుమానం". "సరేగానీ డబ్బు తీసుకోవడానికి ఏమీ అనిపించలేదా?" "ఊరుకో సార్,మేమేమన్నా అడిగినామా?వాళ్లకు తిమ్మరం పట్టి ఇల్లిల్లూ వెదుక్కుంటూ వచ్చి ఇస్తుంటే...మేము తీసుకోకుంటే ఆ పంచేనాయాళ్లే జేబులో వేసుకుంటారు..ఉద్దరకొచ్చే మాలక్ష్మిని వద్దనుకుంటామా?" "ఇద్దరూ డబ్బిచ్చినప్పుడు ఎవరికి ఓటేసావు?" "సమన్యాయం చేసి మా 4 ఓట్లు రెండిటు,రెండటూ వేసాము" "సరేగానీ ఇంత భారీ మెజారిటీతో తెదేపా ఎలా గెలిచింది?నీకు తెలిసిన కారణాలు చెబుతావా?మీ కులసంఘం పెద్దలు ఏం చెప్పారు?" "ఏం కులమో ఏమో సార్?మాకు మిగిలిన వారికున్న ఐక్యత లేదు..అందరూ చూడు ఆత్మీయ సమావేశాలు పెట్టుకుని ఎంత లాభం పొందినారో,మేమూ ఉన్నాము"... సరే మొత్తానికి మా శ్రీరాములు చెప్పిన ఎన్నికల విజయానికి కారణాలు,మెజారిటీ 20,000+ అంటూ పందెంలో 9 లక్షలు గెలిచిన మా మనోహర్,5 లక్షలు గెలిచిన ఫలానా రెడ్డి..ఇంకా ఇతరులు చెప్పిన కారణాలను, వచ్చిన రిపోర్టులను  విశ్లేషిస్తే తెలిసిన విషయాలివి.

 

 

నంద్యాల ఎన్నిలక పోస్టమార్టెట్-2  ఇక్కడ

click me!