రాయలసీమోళ్లను, పులివెందులోళ్లను గూండాలన్నపుడు ఎక్కడున్నవ్?

 
Published : Apr 08, 2017, 07:10 AM ISTUpdated : Mar 28, 2018, 04:59 PM IST
రాయలసీమోళ్లను, పులివెందులోళ్లను గూండాలన్నపుడు ఎక్కడున్నవ్?

సారాంశం

అనంతపుర్ నుంచి పోటీ చేయనున్న తమ్ముడు పవన్ కు విజ్ఞప్తి 

దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటారు అని ఉత్తరాది మాజీ బీజేపీ MP అనడం తప్పే , ఒప్పుకుంటాము తరువాత అతను సారీ కూడా చెప్పాడు అయినా మీకు చాల బాధ వేసింది
మరి ఉదయం లేస్తే రాయలసీమ గుండాలు అనే బాబు ను చిన్న మాట అనవేమి ???


తుని కాపు గర్జన లో అక్కడ రైలు తగలబడుతుంటే బాబు ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ గూండాలు, పులివెందుల రౌడీలు చేసారు అన్నాడు కదా, ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళు అంతా కోస్తా కాపులే కదా !!!

 

మీరు పోటీ చేసే అనంతపుర్ రాయలసీమ లోనే ఉంది తమ్ముడూ !!!

 

మీరు విభజన జరుగుతున్న 6 నెలల సమయం లో తీవ్రంగా బాధ పడుతూ బయటకి రాకుండా 11 రోజులు అన్నం మానేశారు ,ఇప్పుడు మరలా ఉత్తరాది దక్షిణాది విభజన అవసరమా ?
అఫ్ కోర్స్ తెలంగాణ వెళ్లి కాంగ్రెస్ మెడలు వంచి వీపు మీద గుద్ది తెలంగాణ ఇచ్చింది BJP కాబట్టి ఓటు వేయమ్మంది కూడా మీరే , ఏంటో ఈ కాంట్రాస్ట్ !!!

 

TDP MLA చింతమనేని చౌదరి MRO వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిస్తే స్పందించరు.


TDP MLA బోండా ఉమా, TDP MP కేశినేని నాని ,కాల్ మనీ ఫెమ్ MLC బుద్ధా వెంకన్న వెళ్లి నిజాయతీ పరుడైన IPS ఆఫీసర్ బాలసుబ్రమణ్యం ను దూషించి అయన గన్ మెన్ ను తోసేస్తే స్పందించరు కానీ అక్కడేక్కడో ఎవరో ఎదో అంటే మాత్రం వెంటనే మీ లోని కొమరం పులి నిద్రలేస్తారు.

 

ఇంకా AP లో అనేక అక్రమాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి , అయినా స్పందించరు.

 

మీరు చెప్పిన పాచిపోయిన లడ్లు మహా ప్రసాదం అంటున్న బాబు గురించి కూడా మాట్లాడు తమ్ముడూ ???

 

ఎంత కాదనుకున్న మీరు పాపులర్ సినీ హీరో , మీకంటూ మంచి ఫాలోయింగ్ ఉంది , మీరు స్పందించాల్సినప్పుడు స్పందించకుండా చిన్న చిన్న విషయాల మీద స్పందిస్తే మీ ఇమేజ్ కే భంగం ,ఆపై మీ ఇష్తమ్ !!!

 

చివరగా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అంటారు పెద్దలు.

 

హెచ్చరిక -చెడు కామెంట్లు వద్దు

 

- రాణాప్రతాప్

 

(ఫేస్ బుక్ నుంచి)

PREV
click me!

Recommended Stories

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?