టీచర్లను ఎందుకు బద్నాం చేస్తున్నరు

 |  First Published Jan 9, 2018, 6:52 PM IST

టర్మ్ హాలిడేస్ పెరిగాయా? ఎక్కడా?

ఉపాధ్యాయులకు దసరా, సంక్రాంతి పండుగల పేరిట సెలవులే సెలవులంటూ ఈ మధ్య నేను వాట్స్ ఆప్ లో కొన్ని పోస్టింగులు చూశా. గతం కంటే స్కూళ్లకు సెలవులు నిజంగా పెరిగాయా? ఒకసారి పరిశీలిద్దాం..

Latest Videos

undefined

గతంలో దసరా సెలవులు మహాలయ అమావాస్య నుంచి 12 రోజులకు మించకుండా ఉండేవి. సెలవుల ముందో, వెనకాలో ఆదివారం ఉంటే ఇంకో రోజు అదనంగా... అంటే 13 రోజులుండేవి. సంక్రాంతికి  మాత్రం ప్రతిసారి జనవరి రెండో వారంలో ప్రారంభించి.... 10 రోజులు ఖచ్చితంగా సెలవులుండేవి. అంటే దసరా, సంక్రాంతి సెలవులు కలిపితే గతంలో ఖచ్చితంగా 22 రోజులుండేవన్నమాట!

మరి, ఇప్పుడో? దసరాకు 15 రోజులు, సంక్రాంతికి 5 రోజులు సెలవులు ప్రకటిస్తున్నారు. గతంతో పోలిస్తే సెలవులు 2 తగ్గాయేకాని పెరగలేదు. వాస్తవాలిలా ఉండగా... టీచర్లకు సెలవులే... సెలవులు అనడం అన్యాయం కాదా? ఇది టీచర్లను బద్నాం చేయడం కాదా? ఈసారి జనవరి 12 నుంచి 16 వరకు ఐదు రోజులు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ ఐదు రోజుల్లో మూడు ప్రభుత్వ సెలవు దినాలే. స్కూళ్లకు సంక్రాంతి సెలవుల పేరిట అదనంగా ఇచ్చింది కేవలం రెండు రోజులే. ఈ రెండు రోజులు అదనంగా ఇవ్వడంవల్ల సంక్రాంతి సెలవులను టీచర్లు ప్రిఫిక్స్, సఫిక్స్ చేసుకునే వీల్లేకుండా పోయింది.

అయితే... ఐదు రోజుల సంక్రాంతి సెలవులను కలుపుకొని ముందు, వెనకాల పదిరోజులకు మించకుండా CL పెట్టుకునే అవకాశం మాత్రం ఉందనుకోండి. కొంతమందికి నిజాలు తెలియవా? లేక ఉద్దేశ్య పూర్వకంగానే టీచర్లను బద్నాం చేస్తున్నారా? దసరా, సంక్రాంతి, వేసవి సెలవులనూ రద్దుచేసి.... పాఠశాల విద్యాశాఖను నాన్-వెకేషన్ డిపార్ట్మెంట్ గా ప్రకటిస్తే... పనిచేయడానికి ఉపాధ్యాయులందరూ సిద్ధం!

 

ఇట్లు...


మానేటి ప్రతాపరెడ్డి.

 

(* రచయిత మానేటి ప్రతాపరెడ్డి, టిఆర్ టిఎఫ్ కరీంనగర్ శాఖ అధ్యక్షులు)

click me!