లెగ్‌పీసెస్ జగన్ సామాజికవర్గానికే... అవి మాత్రమే మిగతావారికి: టిడిపి ఎమ్మెల్యే ఎద్దేవా

By Arun Kumar P  |  First Published Dec 11, 2019, 8:28 PM IST

వైసిపి ప్రభుత్వంలో కేవలం ఒకే  ఒక సామాజిక వర్గం  హవా కొనసాగుతోందని టిడిపి ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆరోపించారు. మంత్రులకంటే సీఎం జగన్ సామాజికవర్గానికి చెెందినవారులే అధికారాలను చెలాయిస్తున్నారని అన్నారు.  


అమరావతి: ఆర్టీసీఛార్జీల పెంపుని నిరసిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో సహా ఎమ్మెల్యేలమంతా ఆందోళన తెలియచేస్తుంటే తమపట్ల దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ వాపోయారు. సభాహక్కులు మంటగలిపేలా తమచేతుల్లోని ఫ్లకార్డులను లాగేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారపార్టీ సభ్యులు ఏంచేసినా చెల్లుతుందనేలా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.

బుధవారం అశోక్ అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ... సభలో జరిగిన పరిణామాలను, అధికార పార్టీ ఆగడాలను ఏకరువుపెట్టారు. ప్రతిపక్షనేతకు అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్‌ ఇవ్వని ప్రభుత్వం ఆయన లేవనెత్తిన అంశంపైనే ఏకంగా ఐదుగురు అధికార పార్టీ సభ్యులతో ఎలా మాట్లాడించిందో సమాధానం చెప్పాలని అశోక్‌ డిమాండ్‌ చేశారు. 

Latest Videos

read more సొంత నియోజకవర్గంలోనే జగన్ పరిస్థితి ఇదీ... ఇక రాష్ట్రంలో...: టిడిపి ఎమ్మెల్యే

ఆఖరికి సభాపతిస్థానాన్ని కూడా డిక్టేట్‌ చేసే స్థాయికి అధికార పార్టీ చేరిందన్నారు. సభాపతి తనస్థానాన్ని కాపాడుకోవాలని, తనగౌరవాన్ని పెంచుకోవాలని  చంద్రబాబునాయుడు సూచిస్తే ఆయన్ని కూడా తప్పుపడుతున్నారని అన్నారు.. 

సభలో జరిగే విషయాలు ప్రజలకు తెలియకుండా మీడియాను కట్టడిచేస్తూ ప్రభుత్వం సొంత  ప్రచారం చేసుకుంటోందన్నారు. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తిచూపే బాధ్యత ప్రతిపక్ష సభ్యులుగా తమకుందన్నారు. ఆరునెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఇప్పుడు తమని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. 

read more ముగిసిన ఏపి మంత్రివర్గ సమావేశం... నిర్ణయాలివే

రాష్ట్రంలో మంత్రులకన్నా రెడ్డి సామాజికవర్గ సలహాదారులే ఎక్కువున్నారని... ప్రభుత్వం చెబుతున్న స్కిల్స్‌ ఇతర వర్గాలవారికి ఉండవా అని టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. చికెన్‌లో లెగ్‌పీసులన్నీ జగన్‌వర్గానికి వెళుతుంటే బోటీయేమో ఇతరవర్గాలకు దక్కుతుందనంటూ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.    


  

click me!