ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం ప్రజల్లో గందరగోళాన్ని సృస్టిస్తోందన్నారు.
కర్నూల్: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మొత్తంగా రాయలసీమ అభివృద్ధిపై మాత్రం ఏమి మాట్లాడటం లేదని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని... ఆయన సరైన సమాధానం చెబితే అప్పుడు తన అభిప్రాయం చెబుతానని ఆమె వెల్లడించారు.
తుఫాన్ లు వచ్చే సముద్రతీరం వైజాగ్ లో సచివాలయం పెడితే ఎలాగా అని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టును స్వాగతిస్తున్నానని...కానీ రాయలసీమకు కావాల్సింది చాలా ఉందన్నారు. కర్నూల్ నగరాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆ విషయంలో జగన్ క్లారిటీ ఇవ్వాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు.
undefined
read more తుళ్లూరు పంచాయితీకి నల్లరంగు... నాన్ బెయిల బుల్ అరెస్టులే
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయం అహోబిలంలో నాటుసారా ఏరులై పారుతుందని మాజీ మంత్రి తెలిపారు. వైసీపీ నేతలే మహిళల చేత బెల్టు షాపు లను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం తమ వద్ద ఉన్నాయని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని అఖిలప్రియ ప్రశ్నించారు.
దీనిపై స్థానిక డిఐజి, జిల్లా ఎస్పీకి వీడియో ఆధారాలతో పిర్యాదు చేస్తామని... బెల్టు షాపులను నిర్వహిస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. పుణ్యక్షేత్రమైన అహోబిలం పవిత్రతను కాపాడాలని ఆమె పోలీసులకు సూచించారు.