రాయలసీమలో హైకోర్టు కోసం ఆందోళనలు : విద్యార్ధి నేతల అరెస్ట్

By Siva KodatiFirst Published Sep 29, 2019, 12:15 PM IST
Highlights

రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని పలువురు విద్యార్ధి సంఘం నేతలు హెచ్చరించడంతో ఎమ్మిగనూరులో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు

రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని పలువురు విద్యార్ధి సంఘం నేతలు హెచ్చరించడంతో ఎమ్మిగనూరులో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఉదయం ఎమ్మిగనూరులోని వైఎస్సార్ కూడలిలో ఎన్ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ విద్యార్ధులు రాజధాని, హైకోర్టులు రాయలసీమలోనే ఏర్పాటు చేయాలంటూ నిరసనకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఘర్షణ తలెత్తింది. అనంతరం విద్యార్ధులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

ఇదే క్రమంలో ఆదివారం ఎమ్మిగనూరు వస్తున్న మంత్రులను సైతం అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న పలువురిని ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. 

click me!