కర్నూల్ ఇసుక సత్యాగ్రహం ర్యాలీలో ఉద్రిక్తత

కర్నూల్ జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇసుక సత్యాగ్రహ ర్యాలీ నిర్వహించారు.  ఇసుుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా జరిగిన ఈ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. 


కర్నూలు జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఇసుక సత్యాగ్రహ ర్యాలీ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇసుక సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా ఉచితంగా ఇసుక ఇవ్వాలని కోరుతూ పట్టణంలోని బళ్లారి చౌరస్తా నుండి పెద్దపాడు దగ్గర ఉన్న ఇసుక డంప్ యార్డ్ వరకు ఇసుక సత్యాగ్రహ ర్యాలీ నిర్వహించారు.

Latest Videos

 ఇసుక సత్యాగ్రహం ర్యాలీ డంప్ యార్డ్ లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డగించి నిరసనకారులను అరెస్టు చేయడం జరిగింది. వారందరిని స్థానికి పోలీస్ స్టేషన్ కు తరలించి  కాస్సేపటి తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. నిర్మల, కె. రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృత్రిమంగా ఇసుక  కొరతను సృష్టించి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు పనిలేకుండా పస్తులతో చంపుతుదని విమర్శించారు. 

video news:అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన ఎఫెక్ట్... ఆళ్లగడ్డ ఎమ్మార్వో ఆఫీస్‌లో

బ్రిటిష్ కాలంలో భారతదేశ ప్రజలపై ఉప్పుపై పన్ను వేసినందుకు ఆనాడు గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేపట్టిన నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే నడుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలపై మోయలేని విధంగా ఇసుకపై మోపిన భారాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ఇసుక సత్యాగ్రహం చేపట్టవలసి వచ్చిందని అన్నారు. 

ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యల నుండి కాపాడాలని, ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా ఇసుక సమస్యతో పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం 20 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.

video: దేవినేని అవినాశ్ పార్టీ మార్పు.... కార్యకర్తల సమావేశం మెజార్టీ అభిప్రాయమిదే

ఆకలి చావులతో ఆత్మహత్యలతో చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు , మహిళా సంఘం నాయకులు  తదితరులు హాజరయ్యారు. ఇసుక డంప్ యార్డు దగ్గర పోలీసులు నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
 

click me!