హైకోర్టు సాధనపై రాయలసీమలో ఉద్యమం: కర్నూలులో నిరసన తెలిపిన ఉద్యమకారులు

By Nagaraju penumalaFirst Published Oct 1, 2019, 5:53 PM IST
Highlights

అక్టోబర్ 1న 67వ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినాన్ని జరుపుకుందాం అంటూ నిరసన కారులు ఆందోళనకు దిగారు. శ్రీభాక్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

కర్నూలు: కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ ప్రజలు చేస్తున్న ఆందోళన తీవ్రతరమవుతుంది. రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ప్రజలు విద్యార్థులు, కవులు, కళాకారులు కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ నిరసనలకు దిగుతున్నారు. 

అక్టోబర్ 1న 67వ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినాన్ని జరుపుకుందాం అంటూ నిరసన కారులు ఆందోళనకు దిగారు. శ్రీభాక్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని,పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. 

ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో రాయలసీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అస్థిత్వం ఆత్మగౌరవమే తమ నినాదం అంటూ రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక డిమాండ్ చేసింది.   
 

click me!