వినాయక నిమజ్జనంలో అపశ్రుతి... చావు బతుకుల్లో కానిస్టేబుల్

Published : Sep 12, 2019, 01:42 PM ISTUpdated : Sep 12, 2019, 05:44 PM IST
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి... చావు బతుకుల్లో కానిస్టేబుల్

సారాంశం

బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ వద్ద గణనాధుడి విగ్రహాన్ని క్రేన్ తో లారీలో పెట్టే సమయంలో ప్రమాదవశాత్తు ఓ పోలీస్ కానిస్టేబుల్ క్రేన్ పై నుంచి కిందకు పడిపోయాడు

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో వినాయక నిమజ్జనంలో గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ వద్ద గణనాధుడి విగ్రహాన్ని క్రేన్ తో లారీలో పెట్టే సమయంలో ప్రమాదవశాత్తు ఓ పోలీస్ కానిస్టేబుల్ క్రేన్ పై నుంచి కిందకు పడిపోయాడు.

తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు హుటాహుటిన నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన బహదూర్‌పుర పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవీందర్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?
హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి