పోలీస్ అమరవీరుల వారోత్సవాలు... కర్నూల్ లో మెగా వైద్యశిబిరం

By Arun Kumar PFirst Published Oct 19, 2019, 4:57 PM IST
Highlights

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం కర్నూల్ లో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో 252 మంది పోలీసులు, వారి కుటుంబాలు ఉచిత వైద్య పరీక్షలు జరిపించుకున్నారు. 

కర్నూల్: విధుల్లో భాగంగా ప్రాణాలను కోల్పోయిన పోలీస్ త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది అమరవీరుల వారోత్సవాలు జరిగుతుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా వారోత్సవాలను ఇరు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ శాఖ ఘనంగా నిర్వహిస్తోంది. కర్నూల్ జిల్లాలో ఈ వారోత్సవాల్లో భాగంగా రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

 ఈ క్రమంలోనే శనివారం  జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో  ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు ను ఓఎస్డీ ఆంజనేయులు ప్రారంభించారు.

 ముఖ్యంగా కార్డియాలజి, ఆర్దోపెడిక్స్, గైనకాలజీ విభాగాలకు చెందిన కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ల ఆధ్వర్యంలో 252 మంది పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి, బ్లడ్ షుగర్ టెస్ట్, ఈసిజి, 2డి ఎకో వంటి వైద్య పరీక్షలు మరియు వాటికి సంబందించిన సలహాలు , సూచనలు తెలియజేశారు. 

ఈ సంధర్బంగా ఓఎస్డీ ఆంజనేయులు మాట్లాడుతూ....  పోలీసు అమరవీరుల దినోత్సవం సంధర్బంగా జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ పరిధులలో వారం రోజుల నుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శనివారం రోజు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్ లో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి పోలీసుకుటుంబాలకు, సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించామన్నారు. 

పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలు వైద్య పరీక్షలు చేయించుకుని జీవితంలో ఆరోగ్యంగా  ఉండాలన్నారు. ఏవైనా సమస్యలుంటే వాటిని ముందుగానే గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  

కొంతమంది సరైన అవగాహాన లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పోలీసులు ఆరోగ్యంగా, ఫిట్ నెస్ తో ఉంటనే కుటుంబం, సమాజం  బాగుంటుందన్నారు.

ఈ ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటుకు కృషి చేయించిన  జిల్లా ఎస్పీ కి, కిమ్స్ డాక్టర్లకు  పోలీసు కుటుంబాల వారు  కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ రాధాక్రిష్ణ, మినిస్టిరియల్ సిబ్బంది,  పోలీసు కుటుంబాల వారు  పాల్గొన్నారు.

click me!
Last Updated Oct 19, 2019, 4:57 PM IST
click me!