పోలవరం మట్టినీ టిడిపి వదల్లేదు...సమీక్షా సమావేశంలో మంత్రుల సీరియస్ కామెంట్స్

By Arun Kumar P  |  First Published Dec 3, 2019, 6:28 PM IST

పోలవరం మట్టి విషయంలోనూ టిడిపి హయాంలో అక్రమాలు జరిగాయని ఏపి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు ఆరోపించారు. సచివాలయంలో గనులు, ఇరగేషన్ శాఖ అధికారులతో మంత్రులు సమీక్షా సమావేశం  నిర్వహించారు.  


అమరావతి: పోలవరం మట్టి అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని  ఇరిగేషన్‌, గనులశాఖ అధికారులకు సంబంధిత మంత్రులు సూచించారు. ఇసుక పాలసీ మాదిరిగానే మట్టి పాలసీని అమలు చేయాలని ఆదేశించారు. ఈ విషయాలపై సచివాలయం వేదికన జరిగిన సమావేశంలో ఇరిగేషన్‌, గనులశాఖ అధికారులతో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనీల్ కుమార్‌ యాదవ్  చర్చించారు.  

ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్, గనులశాఖ ముఖ్య కార్యదర్శి రామగోపాల్, ఇరిగేషన్‌ ఇఎన్‌సి వెంకటేశ్వరరావు, సిఇ పోలవరం సుధాకర్‌ బాబు, ఆర్ఎంసి ఎస్ఇ  వీరకుమార్, ఎల్ఎంసి ఎస్ఇ శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ఇరిగేషన్‌, గనులశాఖ అధికారులు పాల్గొన్నారు. 

Latest Videos

undefined

గత ప్రభుత్వంలో పోలవరం మట్టిని దోపిడీ చేశారన్నారు. ప్రభుత్వానికి కనీసం సీనరేజీ కూడా చెల్లించకుండా మట్టిని విక్రయించడం ద్వారా కోట్లాది రూపాయలు దండుకున్నాయన్నారు. ఇలా కోట్లాధి రూపాయల విలువైన పోలవరం మట్టిని అనధికారికంగా తరలించారని ఆరోపించారు. 

read more  పవన్ కాల్షీట్స్ ఇచ్చేశారు....బీజేపీలో జనసేన విలీనమే మిగిలింది...: పేర్ని నాని

మట్టి మాఫియాకు చెక్ పెట్టేందుకు వైసిపి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. పోలవరం కాలువ గట్లపై సుమారు 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్ సాయిల్ వుందని... దీనిని ఎస్ఎస్ఆర్ రేట్ ల ప్రకారం విక్రయిస్తే ప్రభుత్వానికి సుమారు రూ.1000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. దీనిలో ఇరిగేషన్‌ శాఖకు రూ.700 కోట్లు, మైనింగ్ శాఖకు సీనరేజీ కింద రూ. 300 కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. 

ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల పరిధిలో మట్టి నిల్వలు, పోలవరం మట్టిని నిల్వ చేసేందుకు సుమారు ఐదు వేల ఎకరాల భూమి వినియోగించాల్సి వస్తుందన్నారు. ఈ మట్టి విక్రయాల తరువాత ప్రభుత్వ అవసరాలకు సదరు ఖాళీ భూమిని వాడుకోనున్నట్లు తెలిపారు. 

నాలుగు జిల్లాల పరిధిలో కాలువలపై మట్టిని 80 ప్యాకేజీలుగా గుర్తించనున్నట్లు తెలిపారు. ఇరిగేషన్‌, మైనింగ్ అధికారులు సంయుక్తంగా ఈ ప్యాకేజీలను పరిశీలించాలని...రెండు వారాల్లో దీనిపై ఓ పాలసీని రూపొందించాలన్నారు. కాలువ గట్లపై వున్న గ్రావెల్, మెటల్, మట్టిని వర్గీకరించాలని ఆదేశించారు.  

read more జనసేనను బిజెపిలో విలీనం చేయాలన్నదే పవన్ ప్లాన్: కొడాలి నాని

ఎర్త్ సాయిల్ క్యూబిక్ మీటర్ రూ. 86,  గ్రావెల్ కు  రూ.113 గా రేటు ఖరారు చేశారు.  అదనంగా మైనింగ్ సీనరేజ్ కింద క్యూబిక్ మీటరకు 30 రూపాయలుగా నిర్దారించారు. మట్టి నిల్వలను టెండర్, ఆక్షన్‌ పద్దతుల్లో విక్రయించాలని సూచించారు.

మూడేళ్లలో ఈ మట్టినిల్వలను విక్రయించుకోవచ్చని సూచించారు. ఇప్పటికే 71 లక్షల క్యూబిక్ మీటర్ల కోసం 41 దరఖాస్తులు వచ్చాయని.. గ్రావెల్, మెటల్ వున్న ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ వస్తోందన్నారు. మెటల్ ఎక్కువగా వున్న చోట్ల అవసరమైతే క్రషర్ లకు కూడా అనుమతి ఇచ్చే అంశం పరిశీలించాలని మంత్రులు అధికారులకు సూచించారు. 


 

click me!