కాకినాడలో క్షుద్రపూజలు: అర్ధరాత్రి అరుపులు.. ఉలిక్కిపడ్డ జనం

Siva Kodati |  
Published : Sep 29, 2019, 01:11 PM IST
కాకినాడలో క్షుద్రపూజలు: అర్ధరాత్రి అరుపులు.. ఉలిక్కిపడ్డ జనం

సారాంశం

కాకినాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. నగరంలోని రాయుడుపాలెం శ్రీనివాస్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా అరుపులు, కేకలు, మంత్రాలు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు

కాకినాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. నగరంలోని రాయుడుపాలెం శ్రీనివాస్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా అరుపులు, కేకలు, మంత్రాలు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

వేళ కానీ వేళలో మంత్రాలు వినిపిస్తుండటంతో హడలిపోయిన జనం... ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అటువెైపుగా వెళ్లారు. దగ్గరలోని అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి చూడగా.. కాల్చిన నిమ్మకాయలు, పసుపు బియ్యం, కుంకుమ పడివున్నాయి.

వెంటనే క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. నిందితుడిని షేక్ మొహ్మద్ బషీర్‌గా పోలీసులు గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...