లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు రెడీ...కావాలనే దుష్ప్రచారం..: నాదెండ్ల

By Arun Kumar P  |  First Published Nov 2, 2019, 5:51 PM IST

ఉపాధి కోల్పోయి, ప్రాణత్యాగాలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికులుకు న్యాయం చేసేందుకు విశాఖలో లాంగ్ మార్చ్ చేస్తున్నామని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో లాంగ్ మార్చ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.  


విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చేయడం,  భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను నివారించడంలో వైఎస్సార్‌సిపి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అందువల్లే జనసేన పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన బాట పట్టాల్సి వచ్చిందని...అందుకోసమే విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. 

ఉపాధి కోల్పోయి, ప్రాణత్యాగాలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికులుకు న్యాయం చేసేందుకు లాంగ్ మార్చ్ చేస్తున్నామని వెల్లడించారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో లాంగ్ మార్చ్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

Latest Videos

undefined

ఏ పార్టీలో లేని విధంగా పెద్ద ఎత్తున మహిళలు ఈ  ర్యాలీకి తరలివస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో కొన్ని మీడియా సంస్థలు జనసేనకు అనుమతులు లేవంటు ప్రచారం చేస్తున్నాయని...ఈ లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు ఉన్నాయని వెల్లడించారు. గత నెల 28వ తేదీనే అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు.  పోలీసులు ఎటువంటి ఇబ్బందులు పెట్టడం లేదన్నారు. 

read more  పార్టీపెట్టిన నీకే దిక్కులేదు,నువ్వు నీ పోరాటం: పవన్ పై మంత్రి ధర్మాన ఫైర్

అనుకున్న సమయానికే మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుండి ఉమెన్స్ కాలేజ్ వరకు లాంగ్ మార్చ్ జరుగుతుందన్నారు.  ఉమెన్స్ కాలేజ్ వద్ద బహిరంగ సభ జరుగుతుందని నాదెండ్ల వెల్లడించారు.  

విశాఖ జనసేన నాయకులు లక్ష్మి నారాయణ మాట్లాడుతూ... ఈ ప్రభుత్వ ఇసుక పాలసీల వల్లే కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం ఇసుకలో అవినీతి చేస్తే వారిపై  కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో భవన నిర్మాణ కార్మికులు చాల ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

read more  జనసేన లాంగ్ మార్చ్ కి బాబు టీం రెడీ: పవన్ తో అడుగేయనున్న ముగ్గురు మాజీమంత్రులు

తాము ఇప్పుడెలా బ్రతకాలో అర్థం కావడం లేదని... ఇది వరకు క్యాంటీన్లు పుడ్ పెట్టేవని ఇప్పుడు అది కూడా లేకుండా చేసారని కార్మికులు బాదపడుతున్నారని అన్నారు.  మత్య్సకారులకు వేట విరామం సమయంలో ఇచ్చే భృతిలాగే భవన నిర్మాణ కార్మికులుకు భృతి చెల్లించాలని  డిమాండ్ చేశారు. పదివేల రుపాయల నెలసరి భృతిని భవన నిర్మాణ కార్మికులుకు చెల్లించడమే కాదు వెంటనే ప్రభుత్వం ఇసుక కొరత తీర్చాలని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

   

click me!