అన్నధాతలు పండించిన పంటకు కనీస మద్దతుధర ఎతుండాలన్న దానిపై గురువారం దినపత్రికల్లో ప్రకటన ఇస్తామని మంగళవారం అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయంపై తాాాజాగా వెనక్కి తగ్గారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ ఉత్పత్తులు, పంట కొనుగోలు కేంద్రాల మీద సమీక్ష చేపట్టారని మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. రైతులు తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించకుంటే ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి తెలపాలని...ముఖ్యమంత్రి కూడా ఇదే ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అలాంటి సమయాల్లో ప్రభుత్వమే రైతు నుండి పంటను కొనుగోలు చేస్తుందన్నారు.
వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించినట్లు వెల్లడించారు. ఈకొనుగోలు కేంద్రాలతో పాటు శాశ్వత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా నిర్ణయించారని మంత్రి తెలిపారు.
read more జగన్ కీలక నిర్ణయం: అసైన్డ్ భూముల అమ్మకాలు రద్దు, షాక్‌లో కొనుగోలుదారులు
మంగళవారం ముఖ్యమంత్రి పంట కొనుగోలు కేంద్రాలను, మద్దతు ధరలను గురువారం ప్రకటిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అయితే తమకు కాస్త సమయం కావాలని వ్యవసాయ శాఖ మంత్రిగా తాను సీఎంకి రిక్వెస్ట్ చేశానని... అందువల్ల తన నిర్ణయంపై ఆయన వెనక్కి తగ్గినట్లు తెలిపారు. ఇంకా పూర్తిస్థాయిలో శాశ్వత కేంద్రాలను గుర్తించలేకపోవడం వల్లే ప్రకటనను వద్దనుకున్నట్లు మంత్రి తెలిపారు.
అయితే సీఎం ఆదేశాల మేరకు వచ్చే బుధవారం నాటికి టోల్ ఫ్రీ నంబర్, కొనుగోలు కేంద్రాలను గుర్తించడం, ధాన్యానికి మద్దతు ధరపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా తెలియజేసినట్లు మంత్రి తెలిపారు.
read more ప్రజలు కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదాలనుకున్నారు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు