ఘోరం: కిడ్నాప్ చేసి బాలికపై అత్యాచారం

By telugu team  |  First Published Dec 24, 2019, 12:44 PM IST

పదమూడేళ్ల బాలికను వంశీ అనే యువకుడు కిడ్నాప్ చేసి, ఆమె అత్యాచారం చేశాడు. ఈ సంఘటన హనుమకొండ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.


వరంగల్: బాలికను అపహరించి, ఆమెపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన హనుమకొండ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. హన్మకొండ ఇన్ స్పెక్టర్ పి. దయాకర్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను చెప్పారు. 

శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన ఎం. వంశీ (22) కూలి పనిచేసుకుంటూ గుండ్ల సింగరాంలో నివసిస్తున్ాడు. కొద్ది రోజుల క్రితం హన్మకొండకు చెందిన 13 ఏళ్ల బాలికతో అతనికి పరిచయం ఏర్పడింది. 

Latest Videos

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ నెల 13వ తేదీన తన వెంట తీసుకుని వెళ్లాడు. హన్మకొండ నుంచి కొప్పుల గ్రామానికి బస్సులో తీసుకుని వళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. 20వ తేదీ రాత్రి బాలికను ఆమె ఇంటి సమీపంలో వదిలి వెళ్లాడు.

ఇంటికి చేరుకున్ బాలికను తల్లిదండ్రులు మందలించడంతో వంశీ విషయం చెప్పింది. అదే రోజు ఉదయం తమ కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోమవారం ఉదయం నిందితుడిని అరెస్టు చేశారు. 

click me!