నెల రోజులుగా భర్త మృతదేహం కోసం ఎదురు చూపులు

By narsimha lodeFirst Published Sep 29, 2019, 9:04 AM IST
Highlights

సౌదీలో చనిపోయిన తన భర్త మృతదేహం కోసం హలీమా నెల రోజులుగా ఎదురు చూస్తోంది. తన భర్తను కడసారి చూసుకొనే అవకాశం కల్పించాలని కూడ ఆమె కోరుతోంది.

తిరుపతి:నెలనుండి భర్త మృతదేహం కోసం ఓ భార్య ఎదురు చూపులు చూస్తోంది. చిత్తూరు జిల్లా తంబల్లపల్లి మండలం కొట్టాలకు చెందిన అమీన్ పీర్  సౌదీఅరేబియాలో చనిపోయాడు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు అమీన్ పీర్ మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కొటాలకు చెందిన అమీన్ పీర్ (47)కుటుంబ పోషణ నిమిత్తం అప్పులు చేసి సౌదీఅరేబియా వెళ్ళాడు. అల్ఖాసీం రాష్ట్రంలో ఓ సేట్ వద్ద పనికి కుదిరాడు. రెండు నెలల క్రితం అమీన్ పీర్ భార్య హాలిమితో ఫోన్లో మాట్లాడుతూ తనకు సేట్ ఆరు నెలల జీతం ఇవ్వాలని ఇచ్చిన వెంటనే డబ్బు ఇంటికి పంపుతానని తన భర్త చెప్పాడని ఆమె చెబుతోంది.

అయితే ఆగస్టులో అమిన్ పీర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఆ సమాచారాన్ని ఆలస్యంగా మృతుడి కుటుంబానికి తెలిపారు. పని చేసిన కాలానికి జీతం ఇవ్వడం లేదని మృతదేహాన్ని ఇండియా కు పంపడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దమండెం మండలం చెరువు కింద పల్లి కి చెందిన అమీన్ పీర్ 10 సంవత్సరాల క్రితం  కోటాలకు చెందిన హాలిమా ను పెళ్ళిచేసుకొని ఇక్కడే స్థిరపడ్డాడు. 

వీరికి ఏడేళ్ల కవల పిల్లలు ఉన్నారు. కూలీకి వెళ్తే గానీ పూట గడవని పరిస్థితి వీరిది. ఇప్పుడు ఆ పెద్ద దిక్కు కూడా పోవడంతో ఆ కుటుంబం వృద్దురాలైన మృతుడి అత్త అమీన్ పీర్ పైనే ఆధారపడి జీవిస్తున్నారు. తన భర్త కడసారి చూపుకు నోచుకునే భాగ్యాన్ని కల్పించండని వేడుకుంటోంది మృతుని భార్య హలీమా.

click me!