రైలు ప్రమాదాలకు చెక్... ఈస్ట్ కోస్ట్ రైల్వే వినూత్న ఆలోచన

By Arun Kumar P  |  First Published Nov 27, 2019, 4:58 PM IST

శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది.  


విశాఖపట్నం: ఈస్ట్ కోస్ట్ రైల్వే తన అధికార పరిధిలోని వివిధ రైల్వే విభాగాలలో రాత్రి మరియు తెల్లవారుజామున దట్టమైన పొగమంచును తట్టుకోవటానికి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. పొగమంచుతో ప్రభావితం చేసే ప్రాంతాల్లో ప్రత్యేకమైన పరికరాలను సమకూర్చి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

శీతాకాలంలో పొగమంచు వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ECOR ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు  చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రైళ్ల భద్రత కోసం తీసుకోవలసిన జాగ్రత్తలపై తమ ఉద్యోగులకు ప్రత్యేక సూచనలు చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే విభాగం. 

Latest Videos

undefined

read more  విశాఖలో సీఐఎస్‌ఎఫ్ వాహనం బీభత్సం... ఒకరి మృతి, నలుగురికి గాయాలు

పొగమంచు మరియు దట్టమైన వాతావరణ పరిస్థితులలో రైళ్ల నిర్వహణకు సంబంధించి రైల్వే ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. శీతాకాలంలో దట్టమైన పొగమంచు వాతావరణంలో  ప్రయాణీకుల భద్రత మరియు రైలు కదలికల కోసం దృశ్యమాన పరిస్థితులను బట్టి రైలు వేగాన్ని నియంత్రించమని డ్రైవర్లు (లోకో పైలట్లు) ఆదేశించారు. ఇది కాకుండా, అనేక జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.

క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవటానికి రైలు నడిపించే సిబ్బందికి రైల్వే  ఉన్నతాధికారులు, భద్రతా సలహాదారులు సలహా ఇస్తున్నారు. దట్టమైన పొగమంచుకు గురయ్యే ప్రాంతాల్లో OHE (ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్) మాస్ట్‌లు, లెవల్ క్రాసింగ్‌లు మరియు బిజీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతాలలో ప్రకాశించే ఫ్లోరోసెంట్ స్ట్రిప్స్ పెయింట్ చేయబడ్డాయని తెలిపారు.

 రైలు స్టాప్ సిగ్నల్‌కు చేరుకుంటున్నాయని మరియు సున్నితమైన ప్రాంతాల్లో నడుస్తోందని తెలిపేలా సిబ్బంది ముందుగానే గుర్తించే ఏర్పాట్లు చేశామన్నారు.  పొగమంచు సమయంలో కూడా ఈ ప్రకాశవంతమైన ఏర్పాట్లు, సమీపించే సిగ్నల్ గురించి తెలిపి అదనపు జాగ్రత్తలు తీసుకునేలా లోకో పైలట్లను జాగ్రత్తపర్చడంలో ఈ పరికరాలు సహాయపడతాయన్నారు.

read more  శ్రీవారి భక్తులకు శుభవార్త: 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాల గుండా దర్శనం

పొగమంచు వాతావరణంలో సురక్షితమైన రైలు నడపడానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయ భద్రతా విభాగం సూచనలు ఇచ్చింది. లోకో పైలట్లు మరియు గార్డ్ లు అప్రమత్తంగా వుండాలని సూచించారు. 

click me!