చైనా నుండి భారత్ కు కరోనా వైరస్... ఏపిలో హై అలర్డ్...: మంత్రి ఆళ్ల నాని

By Arun Kumar P  |  First Published Jan 28, 2020, 3:14 PM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ అలజడి సృష్టిస్తోంది. ఈ వైరస్ వ్యాపించినట్లు వదంతులు ప్రచారమవడంతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 


అమరావతి: అతి ప్రమాదకరమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. మరీ ముఖ్యంగా చైనాకు అత్యంత సమీపంలో వున్న భారత్ వంటి దేశాలను ఈ వైరస్ భయం వెంటాడుతోంది. అయితే ఇప్పటికు భారత ప్రభుత్వం అప్రమత్తమై విదేశాల నుండి మరీ ముఖ్యంగా చైనా నుండి భారత్ కు వస్తున్న వారిని విమానాశ్రయాల్లోనే  వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా వుండాలని కేంద్రం సూచించింది. 

ఈ నేపథ్యలో ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్ ను కేంద్ర బృందం పరిశీలిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలతో ఎవరయినా చికిత్స పొందుతున్నారా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇక మరో తెలుగు రాష్ట్రం ఏపిలో కూడా ప్రభుత్వం ఈ కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తమయ్యింది. 

Latest Videos

undefined

read more   కరోనా వైరస్ కి మందు.. మా దగ్గర ఉందంటున్న తమిళనాడు డాక్టర్

ఏపి వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వైరస్  చాలా స్పీడ్ వ్యాపిస్తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఈ వైరస్ చైనా నుండి భారత్ కు వ్యాపించినట్టు నిపుణులు చెపుతున్నారని... కాబట్టి వైద్య శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా వుండాలని మంత్రి సూచించారు. 

ఈ వ్యాధి లక్షణాలు దగ్గు, తుమ్ములు, జలుబు చేయడంతో మొదలవుతాయన్నారు. పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీలు, లివర్ పై ప్రభావం పడుతుందని తెలిపారు. కాబట్టిప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని....ఎక్కడయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు.

read more  తన కోసం తమ్ముడు... కొడుకు కోసం నందమూరి కుటుంబం...: చంద్రబాబుపై అంబటి ఫైర్

రాష్ట్ర వ్యాప్తంగా వైద్య బృందాలను సిద్ధం చేశామన్నారు. అన్ని ప్రాంతాలలో ప్రజలను అవగాహన పరచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్, బస్టాండ్, సినిమా థియేటర్లు, ప్రజలు రద్దీగా ఉన్న ఏరియాలలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు.  ప్రయాణికులు, ప్రజలకు అవగాహన కలిగించే విధంగా మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నాని సంబంధిత అధికారులకు సూచించారు. 
 


 

click me!