అవినాష్ ఆత్మహత్యాయత్నానికి కారణాలివే... : చంద్రబాబు ఆగ్రహం

By Arun Kumar P  |  First Published Mar 7, 2020, 2:56 PM IST

ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌‌ భవనం రెండో అంతస్థు నుండి దూకి టీడీపీ నేత  అవినాష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు స్పందించారు.


గుంటూరు: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌  భవనం పై నుండి టీడీపీ నేత  అవినాష్ దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. అధికార పార్టీ నాయకులు బెదిరింపులు, పోలీసుల వల్ల ప్రాణహాని వుందనే అతడు ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ విషాద ఘటనపై మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. 

''చట్టాలకు పాతరేసి, నిబంధనలను గాలికొదిలేసి పోలీసులు పక్షపాతంగా వ్యవహరించడాన్ని గర్హిస్తున్నాను. వైసిపి ప్రభుత్వ వేధింపులను ఖండిస్తున్నాను. మనమున్నది ప్రజాస్వామ్యంలోనా..? నరహంతక నియంత రాజ్యంలోనా..?''

Latest Videos

''ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది, ఎన్ కౌంటర్ చేసి చంపేస్తామని పోలీసులు అనడం ఏంటి..? తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ చంపేయమని చెప్పిందా వైసిపి ప్రభుత్వం..? పోలీసు వ్యవస్థను గతంలో ఏ ప్రభుత్వమైనా ఇలా దుర్వినియోగం చేసిందా..? ఇలాంటి వేధింపులు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, వేలాదిమందిని జైళ్లకు పంపడం గతంలో ఉన్నాయా..?'' అంటూ చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీశారు. 

read more  పోలీస్‌ స్టేషన్ భవనంపై నుండి దూకి టీడీపీ నేత అవినాష్ ఆత్మహత్యాయత్నం

 ''శ్రీకాకుళంజిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు బాబ్జిగారి కుమారుడు అవినాష్ ఆత్మహత్యాయత్నం వైసిపి ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ట. పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసారంటే ఎంత తీవ్ర మానసిక హింసకు గురయ్యారో తెలుస్తోంది''

''ఇలాంటి వేధింపులు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, వేలాదిమందిని జైళ్లకు పంపడం గతంలో ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు పెచ్చరిల్లాయి. బాధిత ప్రజానీకానికి అండగా ఉండాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడటం గర్హనీయం..కంచే  చేను మేయడం అంటే ఇదే.''
 
''భద్రత కల్పించాల్సిన రక్షణ నిలయాలే అభద్రతకు నెలవులైతే కలిగే దుష్ఫరిణామాలు ఇలాగే ఉంటాయి.గ్రామ సర్పంచిగా పనిచేసిన అవినాష్ ను ఇంతగా భయభ్రాంతులకు గురిచేశారంటే, సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. ఈ అరాచకాలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి'' అని చంద్రబాబు సూచించారు. 
 

click me!