గవర్నర్ బిశ్వ భూషణ్ శ్రీశైలం పర్యటన... చెంచులతో ముఖాముఖి

By Arun Kumar PFirst Published Dec 22, 2019, 4:26 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున స్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో పర్యటించారు. కర్నూలు జిల్లా  పర్యటనలో భాగంగా ముందుగా శ్రీశైలానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు.  ఉదయం 10.30 గంటలకు సున్నిపెంట లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కు గవర్నర్ చేరుకున్నారు. గవర్నరుకు ప్రభుత్వ కర్నూల్ జిల్లా ఉన్నత అధికారులు, శ్రీశైలం ఈఓ కె.స్.రామారావు ఘనంగా ఆహ్వానం పలికారు. 

అక్కడినుండి శ్రీశైలం చేరుకొని ముందుగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించి పూజలను నిర్వహించారు. నఅనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఏర్పాటుచేసిన అక్షర కోటి పంచాక్షరీ సహిత లక్ష కలశాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభిచారు. తదుపరి శ్రీశైలంలో ట్రైబల్ మ్యూజియం, గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనశాలను సందర్శించి చెంచు గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో కొంతసేపు పాల్గొన్నారు. 

చెంచులతో ముఖాముఖి

కర్నూల్,ప్రకాశం,గుంటూరు జిల్లాకు చెందిన చెంచులతో గవర్నర్ ప్రత్యక్షంగా మాటామంతి చేశారు.ఈ సందర్భంగా గిరిజన నాయకులు తమ సమస్యలను గవర్నరుకు తెలిపారు.  ఎస్ఎల్‌బిసి మెంబర్స్ అయిన అంకన్న, అంజయ్య, ముగన్న, మల్లన్నలు వారి సమస్యలను ప్రస్తావించారు. తమకు పట్టాలు ఇచ్చిన అటవీ అధికారులతో సమస్యలు తలెత్తుతున్నాయని గవర్నర్ కు తెలిపారు.

తమకు పక్కా ఇల్లు, ఎద్దులు, బోర్లు, అతవి ఉత్పత్తుల సేకరణ వంటి వాటికి అనుమతి ఇవ్వాలని కోరారు. తమపై దయఉంచి గూడలలో పర్యటించి స్థితిగతులను గమనించి చర్యలు తీసుకోవలసినదిగా విజ్ఞప్తి చేసారు. అలాగే చెంచులు తరపున శ్రీశైలం దేవస్థానం పాలకమండలిలో మెంబర్ గా అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేయడంతో పాటు వినతి పత్రాలను గవర్నరుకు అందజేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ...చెంచు సోదరి, సోదరులకు నమస్కారాలంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ భాధ్యతలను తీసుకున్న తరువాత శ్రీశైలం గిరిజనుల యొక్క సమస్యలను తెలుసుకున్నానని అన్నారు. చెంచుల సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకున్నానని... వారి సమస్యలను పరిష్కరించే రీతిలో చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

చెంచుజాతి ప్రత్యేకమైన ఆదివాసీ తెగ అని... నల్లమల ఆటవీప్రాంతంతో పెనవేసుకుపోయిందన్నారు. ఈ జాతీ ద్వారానే అడవి కాపాడబడుతుందని... ఈ తెగ ప్రత్యేక వ్యత్యాసం ఉంటుందన్నారు. వీరు అటవీ ఉత్పతులనుండి ఇప్పుడు వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇప్పుడు వారి గూడలలో నీరు,వైద్యం,విద్య మౌలిక సదుపాయాలను కల్పింపజేసి వారిని కాపాడుకుంటామని తెలిపారు.

గిరిజనులు తమ పిల్లలను దయఉంచి చదివించాలని... వారిని ఈ జాతి తరపున దేశ భవిష్యత్తుకై పాటుపడేలా తయారుచేయాలన్నారు. ఈ సందర్భంగా  గిరిజన సంఘాలకు కోటి ముప్పై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు చెక్కులను గవర్నర్ పంపిణీ చేశారు.

click me!