డిల్లీ నుండి విశాఖకు ప్రయాణికులతో బయలేదేరిన ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురయ్యింది. ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు గదరగోళానికి గురయ్యారు.
విశాఖపట్నం: దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి విశాఖపట్నం మధ్య నడిచే ఏపి ఎక్స్ ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున డిల్లీ నుండి విశాఖకు భయలుదేరిన రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలను చూసి భయాందోళనకు లోనయిన ప్రయాణికులు పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది. అయితే వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది.
read more అమరావతిలో కొనసాగుతున్న ఉద్యమం... ఉదయమే రోడ్డేక్కిన రైతులు
undefined
ఢిల్లీ నుండి బయలుదేరిన అరగంటకే రైలు బ్రేక్ పట్టేయడంతో B1 భోగి వద్ద మంటలు చెలరేగాయి. అయితే వెంటనే దీన్ని గుర్తించి అప్రమత్తమైన లోకోపైలట్ రైలును అక్కడే నిలిపివేశారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది బోగివద్దకు చేరుకుని మంటలను ఆర్పేశారు. దీంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదంలో ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. అయితే ఏపి ఎక్స్ ప్రెస్ మాత్రం కాస్త ఆలస్యంగా నడవనుంది. మిగతా రైళ్లు యధావిధిగా కొనసాగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.