పెళ్ళైన వారానికే.. భర్తకు విషం ఇచ్చిన భార్య.. అనంతపురంలో దారుణం!

Published : Nov 18, 2019, 01:18 PM IST
పెళ్ళైన వారానికే.. భర్తకు విషం ఇచ్చిన భార్య.. అనంతపురంలో దారుణం!

సారాంశం

ఇటీవల భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము. ప్రియుడి మోజులో పడి భర్తని చంపడం, కుటుంబ సభ్యులని హతమార్చడం లాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

ఇటీవల భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము. ప్రియుడి మోజులో పడి భర్తని చంపడం, కుటుంబ సభ్యులని హతమార్చడం లాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. 

ఈ సంఘటన స్థానికంగా ప్రజలని ఈ సంఘటన ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే..  పెళ్లి జరిగి వారం రోజులు కూడా గడవక ముందే భర్తకు అతడి భార్య విషం ఇచ్చింది. కాళ్ల పారాణి కూడా ఆరక ముందే భర్తను చంపే ప్రయత్నం చేసింది. బాధితుడి పేరు లింగమయ్య. లింగమయ్య తన భార్యతో కలసి అత్తవారి ఇంటికి వెళ్ళాడు. 

లింగమయ్యకు అతడి భార్య పాలల్లో విషం కలిపి ఇచ్చింది. దీనితో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అతడి సోదరుడు ఈ విషయాన్ని గమనించి లింగమయ్యని గుత్తిలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అనంతపురం తరలించారు. 

జొన్నగిరి పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. లింగమయ్య భార్య అతడిని ఎందుకు చంపాలనుకుంది, ఆమెకు వివాహానికి ముందు ఏవైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా లాంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?