అనంత వెంకట రామిరెడ్డికి కీలక బాధ్యతలు...

By Arun Kumar P  |  First Published Nov 7, 2019, 8:27 PM IST

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ అసెెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపి అసెంబ్లీ ఓ ప్రకటనను విడుదల చేసింది.  


అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎథిక్స్‌ కమిటీ సభ్యులుగా అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి నియమితులయ్యారు.  ఈ మేరకు ఏపీ స్టేట్ లెజిస్లేచర్ సెక్రెటరీ బాలకృష్ణమాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.

అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి ఐదు కమిటీలను స్పీకర్‌ తమ్మినేని సీతారం నియమించారు. ఇందులో ఏడుగురితో అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా అంబటి రాంబాబు వ్యవహరించనుండగా సభ్యులుగా ఆరుగురు ఉంటారు. వీరితో వెంకట రామిరెడ్డి ఒకరు. 

Latest Videos

ఐదు దశాబ్దాలకు పైగా అనంతపురం జిల్లా రాజకీయాల్లో వివాద రహితులుగా ఉంటున్నారు వెంకటరామిరెడ్డి. ఇలా "అనంత" కుటుంబం నుంచి తాజా ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అతడికి అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీలో చోటు దక్కింది.

read more అమరావతిలో చెడ్డిగ్యాంగ్ పర్యటన...: టిడిపి నాయకులపై అంబటి షాకింగ్ కామెంట్స్

సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న అనంత వెంకటరామిరెడ్డికి జిల్లాలో మంచి పేరు ఉంది. అనంతపురం ఎంపీగా నాలుగు సార్లు విజయం సాధించిన అనంత... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.

ఎంపీగా ఉన్న సమయంలో అనంతపురం జిల్లా అభివృద్ధి విషయంలో అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి నిధులు రాబట్టడంలో... అభివృద్ధి పనులు చేయడంలో అనంత వెంకట్రామిరెడ్డి సక్సెస్‌ అయ్యారు. 

read more  చిత్తూరులో అగ్రిగోల్డ్ సభ... బాధితులకు చెక్కులు పంపిణీచేసిన ఉప ముఖ్యమంత్రి

వెంకట రామిరెడ్డి తండ్రి అనంత వెంకట రెడ్డి రెండు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేశారు. ఇలా రాజకీయ కుటుంబంలో పుట్టిన ఆయన వారసత్వాన్ని పునికిపుచ్చుకుని రాజకీయాల్లో ప్రవేశించినా అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాందించుకున్నారు. 


 

click me!