స్కూల్ కి వెళ్లి... పదో తరగతి విద్యార్థినులు అదృశ్యం

Published : Feb 06, 2020, 08:20 AM IST
స్కూల్ కి వెళ్లి... పదో తరగతి విద్యార్థినులు అదృశ్యం

సారాంశం

నరసరావుపేట రావిపాడు సైంట్ మెరిస్ స్కూల్ లో పదోతరగతి చదువుతున్న  వేల్పుల పూజిత, సైయ్యద్ షబీన, ఇద్దరు బాలికలు సాయంత్రం స్కూల్ వదిలిపెట్టిన తరువాత నుంచి కనిపించకుండా పోయారు. దీంతో.. తల్లిదండ్రులకు తమకు తెలిసిన ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.  

ఉదయం స్కూల్ కి అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు తిరిగి ఇంటిని చేరలేదు. ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... నరసరావుపేట రావిపాడు సైంట్ మెరిస్ స్కూల్ లో పదోతరగతి చదువుతున్న  వేల్పుల పూజిత, సైయ్యద్ షబీన, ఇద్దరు బాలికలు సాయంత్రం స్కూల్ వదిలిపెట్టిన తరువాత నుంచి కనిపించకుండా పోయారు. దీంతో.. తల్లిదండ్రులకు తమకు తెలిసిన ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.

Also Read మోకాళ్లపై కూర్చొని విద్యార్థులను వేడుకున్న ఉపాధ్యాయుడు...

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు రురల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు బాలికలు ఒకేసారి కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...