సీఎం జగన్ ఫోటోకు 108 సిబ్బంది పాలాభిషేకం...

By Arun Kumar PFirst Published Nov 1, 2019, 6:40 PM IST
Highlights

తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ కు  108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ ఫోటోకు పాలతో అభిషేకం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

కర్నూల్: గత 13సంవత్పరాలు 108 సర్వీస్‌నే నమ్ముకుని ఎంతో నిబద్దతతో పనిచేస్తున్న తమ శ్రమను సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించడం చాలా ఆనందంగా వుందని సిబ్బంది పేర్కొన్నారు. తమ  కష్టాల గురించి తెలుసు కాబట్టే ముఖ్యమంత్రి తాజాగా తమకు అనుకూల నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.  

తమ సమస్యల గురించి ఇన్నాళ్లపాటు కనీసం ఎవ్వరూ పట్టించుకోలేదని...కానీ జగన్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే సమస్యల పరిష్కారినికి చర్యలు తీసుకున్నారని కర్నూల్ జిల్లా 108 సిబ్బంది వెల్లడించారు. 

Video: వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం

ఈ సందర్భంగా కర్నూల్ లో ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి సిబ్బంది పాలాభిషేకం చేశారు. జిల్లా అధ్యక్షుడు రాజేష్ రెడ్డి , జనరల్ సెక్రటరీ జీవన్ ఆదర్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ  కార్యక్రమంలో ఇతర 108 సిబ్బంది కూడా పాల్గోన్నారు. 

నీతి నిజాయితీతో పనిచేసిన ప్రతి ఉద్యోగికి మరియు వారి కుటుంబాలకు ఇది నిజంగా పండగ దినమని వారు ఆనందం వ్యక్తం చేశారు.108 సిబ్బంది ఈ విజయం అందుకోవడం కొరకు ఉద్యోగుల యొక్క సహకారం, జిల్లా కమిటీ సభ్యుల యొక్క మద్దతు మరువలేనివని అన్నారు.

మరీ ముఖ్యంగా సీఎంకు మన వ్యవస్థపై గల మమకారం, నమ్మకం...హామీ ఇస్తే నిలుపుకునే ఉధార స్వభావమే ఇంతటి ఫలితాన్ని అందించిందని స్పష్టం చేశారు. మనం దీర్ఘకాలికంగా కోరుకొన్న విధంగా మరియు ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన విధంగానే ప్రస్తుత నిర్ణయాలున్నాయన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా తమపై మరింత బాధ్యతను పెంచారన్నారు. 

read more  108 వాహనాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఉదయభాను

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపే ప్రత్యేక కార్పొరేషన్లో 108 ఉద్యోగులను చేర్చడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ  రోజును జీవితంలో మర్చిపోలేని రోజుగా భావిస్తున్నామన్నారు.

అలాగే 108 లో ఉద్యోగుల కు ఈఎంటీ లకు 30,000వేలు, పైలట్లకు 28,000వేలు జీతం పెంచడం తమ జీవితాల్లో మర్చిపోలేని ఆనందాన్ని నింపింది అన్నారు. ఈ నిర్ణయాలతో తమ జీవితాల్లో చిరునవ్వులు పూయించిన సీఎం జగన్ కు ఎల్లపుడూ రుణపడి వుంటామని 108 సిబ్బంది పేర్కొన్నారు. 

click me!