దోమ మిమ్మల్ని చంపకముందే.. మీరే దాన్ని చంపేయండి...

By AN TeluguFirst Published Oct 5, 2020, 2:36 PM IST
Highlights

డెంగ్యూ కలిగించే వైరస్, దాని వాహకాల గురించిన అవగాహన ఇటీవలి కాలంలో చాలా వచ్చింది. డెంగ్యూ వాహకమైన ఇడిస్ ఈజిప్టీ దోమల గురించి వారికి ఇప్పుడు తెలుసు. తెలిసినా తెలియకపోయినా కూడా ఈడిస్ ఈజిప్టీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే బెంగళూరులో ఆరువేలమంది, కర్నాటకలో 9300 మంది దీని బారిన పడి బాధపడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటో మానవ జనాభాకు చాలా దగ్గరగా వీటి సంఖ్య ఉండడం. 

డెంగ్యూ కలిగించే వైరస్, దాని వాహకాల గురించిన అవగాహన ఇటీవలి కాలంలో చాలా వచ్చింది. డెంగ్యూ వాహకమైన ఇడిస్ ఈజిప్టీ దోమల గురించి వారికి ఇప్పుడు తెలుసు. తెలిసినా తెలియకపోయినా కూడా ఈడిస్ ఈజిప్టీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే బెంగళూరులో ఆరువేలమంది, కర్నాటకలో 9300 మంది దీని బారిన పడి బాధపడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటో మానవ జనాభాకు చాలా దగ్గరగా వీటి సంఖ్య ఉండడం. 

పైపుల ద్వారా నీటి సరఫరా లేని ప్రాంతాల్లో డెంగ్యూ వైరస్ మోసుకొచ్చే దోమల సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నీటిని నిలువ ఉంచే పాత్రల్లో ఈ దోమలు నివాసం ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడుతున్నాయి. దేశంలోని అనేక నగరాల్లో నీటి సరఫరా వ్యవస్థ సరిగ లేదు. అందుకే ప్రజలు తమ రోజువారీ నీటి అవసరాల కోసం బావులు, చెరువులు, కుంటల్లోని నీటిమీద ఆధారపడుతున్నారు. ఇలాంటి సహజ నీటి నిల్వ ప్రాంతాలు, దీంతోపాటు ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేసే నీటి నిల్వ ప్రదేశాల్లో (పూలకుండీలు, పాడేసిన టైర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు, బకెట్లు, టిన్నులు, వర్షపు నీరు నిలిచిపోయిన ప్రాంతాలు, అలంకరణకు ఉపయోగించే ఫౌంటెన్లు, డ్రమ్ములు, పెంపుడు జంతువులకోసం పెట్టే నీటి పాత్రలు, పక్షులు నీటి పాత్రలు లాంటివి) దోమల సంతతి వృద్ధి చెందుతుంది. జనావాసాలకు దగ్గరగా ఉండే ఇలాంటి ప్రాంతాల్లో దోమలు లార్వాలను వృద్ధి చేయడం ద్వారా ప్రమాదంగా మారతాయి. ఈ దోమ జాతులు తెరిచి ఉంచిన సెప్టిక్ ట్యాంకులు, బావులు, వరదనీటి కాలువలు, వాటర్ మీటర్లలాంటి లోతైన ప్రదేశల్లో కూడా కనిపిస్తాయి. దీన్ని బట్టి మన చుట్టూ అనేక ప్రాంతాల్లో ఇవి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. రక్తం తాగే రాక్షసుల్లా మనల్ని పీల్చి పిప్పి చేయడానికి దినదినాభివృద్ధి చెందుతున్నాయి. 

ఈ దోమలు తొందరగా తమ సంతతిని వృద్ధి చేస్తాయి. అయితే అన్ని సమస్యల్లాగే ఈ సమస్యకూ పరిష్కారం మన చేతుల్లోనే ఉందన్న విషయం ముందుగా మనం గుర్తించాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో, ఇంటి బయట, చుట్టు పక్కల ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవలి. డెంగ్యూలాంటి దోమలతో వ్యాప్తి చెందే వ్యాధుల గురించిన అవగాహన ప్రతీ ఒక్కరికీ ఉండాలన్న విషయం మరిచిపోకూడదు. 

ఒక్క దోమ కూడా ప్రమాదకరమే. కాబట్టి ప్రమాదాన్ని ఆదిలోనే అంతమొందించడం ముఖ్యం. దోమలను సరైన సమయంలో నివారించలేకపోతే అవి ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి దోహదం చేస్తాయి. డెంగ్యూ, చికెన్ గున్యాలాంటివి వ్యాప్తి చేయడం ద్వారా మీ ఆరోగ్యంతో పాటు మీ సంపదకూ ప్రమాదకరంగా మారతాయి. ఈ వ్యాధుల బారిన పడినవారు వైద్యుల లెక్కలో 15 నుండి 20 రోజుల్లో కోలుకుంటారు. కానీ పూర్తిగా కోలుకోవడానికి ఎంత లేదన్నా మూడు నెలల సమయం పడుతుంది. 

అందుకే ఎలాంటి సందేహాలు, అపోహలకు తావివ్వకుండా దోమలు మిమ్మల్ని చంపేయకముందే మీరే వాటిని అంతమొందించండి. 

click me!