ఒక్క దోమ ఉన్నా డేంజరే... వర్షాకాలంలోనే కాదు ఎప్పుడైనా డెంగ్యూ కాటేయచ్చు..

By AN TeluguFirst Published Oct 5, 2020, 2:27 PM IST
Highlights

దోమలతో వ్యాప్తి చెందే వైరల్ వ్యాధి  డెంగ్యూ. ఇటీవలి కాలంలో డెంగ్యూకు సంబంధించిన అవగాహన బాగా పెరుగుతోంది. దీంతోపాటే గత కొన్నేళ్లుగా డెంగ్యూ వ్యాధి కేసులూ విపరీతంగా పెరుగుతున్నాయి. 2019 మే 26 వరకు మనదేశంలో 5500 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఎక్కువ కేసులో ఒక్క కర్ణాటకలోనే నమోదయ్యాయి. 

దోమలతో వ్యాప్తి చెందే వైరల్ వ్యాధి  డెంగ్యూ. ఇటీవలి కాలంలో డెంగ్యూకు సంబంధించిన అవగాహన బాగా పెరుగుతోంది. దీంతోపాటే గత కొన్నేళ్లుగా డెంగ్యూ వ్యాధి కేసులూ విపరీతంగా పెరుగుతున్నాయి. 2019 మే 26 వరకు మనదేశంలో 5500 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఎక్కువ కేసులో ఒక్క కర్ణాటకలోనే నమోదయ్యాయి. 

దోమలతో వచ్చే ఇలాంటి ఉపద్రవాల గురించి జనాల్లో చాలా ఆందోళన ఉంటుంది. దీంతో పాటే డెంగ్యూ వర్షాకాలంలోనే వస్తుందన్న ఓ అపోహ కూడా ఉంది. డెంగ్యూ కారక వైరస్ వల్ల డెంగ్యూ బారిన పడిన వారిలో ప్లేట్ లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల చాలా సందర్భాల్లో వ్యక్తుల ప్రాణాలకే ప్రమాదంగా పరిణమిస్తుంది. 2019నుండి ఇప్పటివరకు డెంగ్యూ బారిన పడి ఐదుగురు మరణించారు. దీన్ని బట్టి ఈ వ్యాధి కేవలం వర్షాకాలానికే పరిమితం కాదన్న విషయం అర్థం చేసుకోవచ్చు.  

డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం ఏంటంటే ఏడాది పొడవునా దోమల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నివారణకు చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో దోమల సంతతి గణనీయంగా పెరుగుతుందన్న మాట వాస్తవమే. అయితే డెంగ్యూ వైరస్ మాత్రం దోమల్లో అన్ని సీజన్లలోనూ చురుకుగా ఉంటాయి. వర్షాకాలంలోనే కాదే వేసవిలో కూడా నిలువ నీరు ఉన్నచోట దోమలు వృద్ధి చెంది తద్వారా డెంగ్యూ వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

ఇవి తప్పనిసరిగా చెక్ చేయాలి : డెంగ్యూతో పోరాడాలంటే ముఖ్యంగా చేయాల్సింది పరిసరాల్లో ఎక్కడా నిలువ నీరు ఉండకుండా చూసుకోవడం. బకెట్లు, టైర్లు, పనికిరాని పాత సామాన్లలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. ఇంటిబయట పనికిరాకుండా పడేసిన పాత వస్తువుల్లో నీరు నిలువు ఉందా చెక్ చేయాలి. వెంటనే వీటిని శుభ్రం చేయడం, దోమలమందు పిచికారీ చేయడం చాలా ముఖ్యం.

మీరు ప్రేమించేవారు సురక్షితంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి : వయసుతో తేడా లేకుండా డెంగ్యూ ఎవరికైనా రావచ్చు. అందుకే మీ పిల్లలు ఆడుకోవడానికి బైటికి వెడుతున్నప్పుడు తప్పనిసరిగా ఫుల్ స్లీవ్స్ వేయడం మంచిది. క్రమం తప్పకుండా దోమల నివారణ మందులు వాడడం చాలా మంచిది.

ఒక్క దోమైనా ప్రమాదకరమే. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు అశ్రద్ధ చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. 

click me!