ధోనీ అరుదైన రికార్డు....భారత క్రికెటర్లలో తొలి వ్యక్తి

By Siva KodatiFirst Published Mar 1, 2019, 1:19 PM IST
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఇప్పటి వరకు 349 సిక్సర్లతో ఉన్న మహేంద్రుడు బుధవారం ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో 350 సిక్సర్లు సాధించిన భారత క్రికెటర్‌గా అవతరించాడు. అలాగే అంతర్జాతీయ టీ20లలో 50 సిక్సర్ల మార్కును చేరుకున్నాడు.

కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో విండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్‌గేల్ (506) అగ్రస్థానంలో ఉండగా, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (476) రెండో స్ధానంలో ఉన్నాడు.

352 సిక్సర్లతో శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యతో కలిసి ధోనీ నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ (349) సిక్సర్లతో ధోనీ తర్వాతి స్ధానంలో ఉన్నాడు.

click me!