ధోనీ రికార్డును బద్దలుగొట్టిన రోహిత్...

By Arun Kumar PFirst Published Mar 10, 2019, 4:25 PM IST
Highlights

ధనా ధన్ షాట్లతో మొహాలీ వన్డేలో చెలరేగినప్పటికి రోహిత్ కొద్దిలొో సెంచరీని మిస్సయ్యాడు. 95 పరుగుల వద్ద భారీ షాట్ తో సెంచరీ సాధించాలని రోహిత్ ప్రయత్నించి ఔటయ్యాడు. అయితే ఈ పరుగులు సాధించే క్రమంలో అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హెలికాప్టర్ షాట్లతో రెచ్చిపోతూ సిక్సర్లతో విద్వంసం సృష్టించే ధోని పేరిట వున్న  రికార్డును తాజా మ్యాచ్ ద్వారా రికార్డును రోహిత్ బద్దలుగొట్టాడు. 

నాలుగో వన్డేలో భాగంగా మొదట బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు చెలరేగిపోయారు. రోహిత్-ధావన్ జోడి సమయోచింతంగా ఆడుతూ చాలా రోజుల తర్వాత జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో రోహిత్ 2 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇలా అతడు బాదిన రెండు సిక్సర్లతో మరో విద్వంసకర ఆటగాడు ధోని పేరిట వున్న రికార్డు బద్దలయ్యింది. ఇప్పటివరకు వన్డేల్లో ధోని 217 సిక్సర్లు బాదగా...దాన్ని అధిగమిస్తూ రోహిత్ 218 సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పటివరకు ధోని పేరిట వున్న రికార్డు రోహిత్ ఖాతాలోకి చేరిపోయింది. 

ఇలా టీమిండియా తరపున అత్యధిక సిక్సర్ల జాబితాలో రోహిత్ మొదటి స్థానంలోకి చేరగా ధోని రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక సచిన్ 195, గంగూలీ 189, యువరాజ్ సింగ్ 153, సెహ్వాగ్ 131 సెంచరీలతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.   
 
click me!