ఆర్మీ క్యాప్‌లు పెట్టుకుంటారా: టీమిండియాపై పాక్ మంత్రి ఫైర్

By Siva KodatiFirst Published Mar 10, 2019, 11:50 AM IST
Highlights

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా భారత్-ఆస్ట్రేలియాలో మధ్య రాంచీలో జరిగిన మూడో వన్టేలో టీమిండియా క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌లు ధరించడాన్ని పాకిస్తాన్ తప్పుబట్టింది.

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా భారత్-ఆస్ట్రేలియాలో మధ్య రాంచీలో జరిగిన మూడో వన్టేలో టీమిండియా క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌లు ధరించడాన్ని పాకిస్తాన్ తప్పుబట్టింది. భారత క్రికెట్ జట్టు క్రికెట్‌ను రాజకీయం చేసిందని పాక్ మంత్రి ఫవాద్ చౌదరీ కోరారు.

భారత్ చేసిన ఈ చర్యపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని ఆయన పీసీబీకి విన్నవించారు. ఒకవేళ తదుపరి మ్యాచుల్లో కూడా టీమిండియా ఆర్మీ క్యాప్‌లను ధరించటం కొనసాగిస్తే పాక్ టీం కూడా కశ్మీర్‌లో దురాగతాలకు పాల్పడుతున్న భారత్‌కు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరిస్తారని చెప్పారు.

కాగా, అమర జవాన్లకు నివాళిగా భారత క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌లు పెట్టుకుని మ్యాచ్ ఆడతారని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసింది. 

click me!