ప్రపంచ కప్ 2019: సెమీ ఫైనల్, ఫైనల్ కూడా వర్షం ముప్పుందా...? అయినా పరవాలేదు: ఐసిసి

By Arun Kumar PFirst Published Jun 13, 2019, 1:48 PM IST
Highlights

నాలుగేళ్లకోసారి వచ్చే వన్డే ప్రపంచ కప్ కోసం ఆటగాళ్లే కాదు క్రికెట్ ప్రియులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఎలాగైనా ప్రపంచ కప్ టైటిల్ ని ముద్దాడి తమ సత్తా చాటాలన్నది ఆటగాళ్ల ఆశయితే... ఈ మెగా  టోర్నీ అందించే క్రికెట్ మజా ను  పొందాలన్నది అభిమానుల ఆశ. కానీ తాజాగా  ఇంగ్లాండ్ వేదికన ఆరంభమైన ఐసిసి వరల్డ్ కప్ 2019 లో ఆటగాళ్లు, అభిమానుల ఆశలపై వర్షం నీళ్లు చల్లుతోంది. 

ఇంగ్లాండ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే చాలా మ్యాచులు రద్దవగా....మరికొన్ని మ్యాచులకు అంతరాయం కలిగించింది. అలాగే ఇకముందు జరిగే మ్యాచ్ లపై  కూడా వరుణుడి ప్రభావం వుంటుందని వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.ముఖ్యంగా  ఇవాళ(గురువారం) టీమిండియా- న్యూజిలాండ్ ల మధ్య జరగనున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం  కలిగించనుందన్నది సమాచారం. దీంతో నిరాశ చెందిన అభిమానులు ఐసిసి ముందు ఓ కొత్త డిమాండ్  వుంచారు. 

ఐసిసి నిర్వహించే ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఏదైనా కారణాలతో మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు పాయింట్లు పంచి చేతులు దులుపుకోవద్దని కోరుతున్నారు. ఆ మ్యాచ్ ను మరో రోజు నిర్వహించేలా ముందే ''రిజర్వ్ డే'' ప్రకటించాలన్నది వారి డిమాండ్.  ప్రపంచ కప్ తో పాటు ఐసిసి నిర్వహించే అన్ని టోర్నీల్లో ఈ పద్దతి పాటిస్తే జట్ల బలాబలాలను బట్టి విజేతలు తేలడమే కాదు తాము నిరాశ చెందకుండా వుంటామని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అయితే అభిమానుల ''రిజర్వ్ డే''  డిమాండ్ పై ఐసిసి స్పందించింది. ప్రతి మ్యాచ్ కు ఇలా  రిజర్వ్ డే ఉంచడం సాధ్యం కాదని వెల్లడించింది. కానీ సేమీ ఫైనల్, ఫైనల్ వంటి మ్యాచులకు మాత్రం ఏదైనా అంతరాయం కలిగితే మరో రోజు నిర్వహిస్తామని తెలిపింది. ఈ ప్రపంచ కప్ టోర్నీలో కూడా సెమీఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్‌ డే ఉన్నట్లు వెల్లడించింది.  లీగ్ దశలో జరిగే 45 మ్యాచులకు రిజర్వ్ డే కేటాయించడం చాలా కష్టసాధ్యమైందని...అస్సలు సాధ్యం  కాదని ఐసిసి స్పష్టం చేసింది. 

click me!