కోహ్లీని అనుసరించడమా... మా అభిమానులు వెరీ డీసెంట్:పాక్ కెప్టెన్

By Arun Kumar PFirst Published Jun 12, 2019, 8:21 PM IST
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఇలా భారత్ తో జరిగిన మ్యాచ్ తర్వాత ఆసిస్ తాజాగా పాకిస్థాన్ తో తలపడుతోంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లతో పాకిస్థాన్ ప్లేయర్స్ ని పోల్చడం సహజంగా జరుగుతుంటుంది. పాక్ అభిమానులు కూడా ఇండియా చేతిలో ఓడిన ఆసిస్ ఎట్టి పరిస్థితుల్లో పాక్ చేతిలోనూ ఓడిపోవాలని... భారత్ కంటే పాక్ ఇంకా మెరుగ్గా ఆడి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తుంటారు. 

అయితే ఈ క్రమంలోనే ఆసిస్, పాక్ మైదానంలో అభిమానులు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. భారత్ తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా అభిమానులు ఆసిస్ ఆటగాడు స్మిత్ ను అవమానించి విషయం తెలిసిందే. అయితే అలా అనుచితంగా వ్యవహరించిన అభిమానులకు కోహ్లీ మైదానంలోనుండే సంజ్ఞల ద్వారా మందలించి అదుపుచేశాడు. దీంతో కోహ్లీ క్రీడా స్పూర్తిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. 

అయితే మీరు ఆస్ట్రేలియాతో తలపడేపుడు ఇలాంటి పరిస్ధితి ఎదురైతే మీరేం చేస్తారని ఓ విలేకరి పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను ప్రశ్నించాడు. అందుకు అతడు  కోహ్లీ మాదిరిగా తమ దేశానికి చెందిన అభిమానులను సముదాయించే అవసరం రాకపోవచ్చని జవాభిచ్చాడు. తమ అభిమానులు కేవలం ఆటను మాత్రమే ఆస్వాదిస్తారు. ఏ జట్టు ఆటగాళ్లయినా బాగా ఆడితే  వారికి మద్దతివ్వడాన్ని  ఇష్టపడతారని సర్ఫరాజ్ వెల్లడించాడు. 

click me!