ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి... కోహ్లీ-రోహిత్ లే కారణం: గంగూలి సంచలనం

By Arun Kumar PFirst Published Jul 2, 2019, 3:57 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు మొదటి ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో ఓడిన టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చివరివరకు నాటౌట్ గా నిలిచికూడా జట్టును గెలిపించలేకపోయిన మహేంద్ర సింగ్  ధోని-కేదార్ జాదవ్ ల జోడి ఈ ఓటమికి కారణమని ప్రతిఒక్కరు విమర్శిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ పై సెంచరీతో రోహిత్ శర్మ, హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ జట్టును గెలిపించడానికి విశ్వప్రయత్నం చేశారంటూ ప్రశంసిస్తున్నారు. అయితే భారత జట్టు మాజీ సారథి, కామెంటేటర్ సౌరవ్ గంగూలీ మాత్రం టీమిండియా ఓటమికి ధోని-కేదార్ లు ఎంత కారణమే రోహిత్-కోహ్లీలు కూడా అంతే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

''338 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీలు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభాన్నిచ్చారు. కానీ లక్ష్యానికి తగినట్లు వేగంగా పరుగులు సాధించలేకపోయారు. తొలి పవర్ ప్లే లో కేవలం 28 పరుగులే రాబట్టగలిగారంటే వారి బ్యాటింగ్ ఆరంభంలో ఎంత స్లోగా సాగిందో అర్థమవుతుంది. అయితే కాస్త కుదురుకున్న తర్వాత వేగాన్ని పెంచినా ఫలితం లేకుండా పోయింది. మొదటినుండి వారు వేగంగా ఆడివుంటే టీమిండియా గెలుపు సాధ్యమయ్యేది. కాబట్టి ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమికి  వీరిద్దరు కారకులే.'' అని గంగూలీ పేర్కొన్నారు. 

 మ్యాచ్ ఆరంభంలో రోహిత్-కోహ్లీ జోడీ ఆడినట్లే చివర్లో ధోని-కేదార్ జోడి ఆడింది. ఈ నలుగురి స్లో బ్యాటింగే టీమిండియా కొంప ముంచింది. చివరి ఐదు ఓవర్లలో సాధించాల్సిన రన్ రేట్ ఒకలా వుంటే భారత బ్యాటింగ్ మరోలా సాగిందన్నాడు. ముఖ్యంగా బౌలర్లపై ఎదురుదాడికి దిగి బ్యాటింగ్ చేయాల్సిన సమయంలో భారత బ్యాట్ మెన్స్ చేతులెత్తేశారని....అందువల్లే టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యిందని గంగూలీ ఆరోపించారు.  

click me!