బంగ్లాతో మ్యాచ్ కు ముందే టీమిండియాకు శుభవార్త...

By Arun Kumar PFirst Published Jul 2, 2019, 3:24 PM IST
Highlights

ప్రపంచ కప్ టోర్నీలో మొదటి ఓటమిని చవిచూసిన టీమిండియాపై అభిమానులు విమర్శలకు దిగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత బౌలర్లు విఫలమవడం వల్లే ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించి విజయాన్ని  అందుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఇలా భారత బౌలింగ్ విభాగం వీక్ గా  మారిందంటూ విమర్శలు వస్తున్న సమయంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఓ శుభవార్త చెప్పారు. 

ఇవాళ(మంగళవారం) బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ కు బౌలర్ భువనేశ్వర్ కుమార్ అందుబాటులో వుంటాడని అతడు వెల్లడించాడు.  పాకిస్థాన్ మ్యాచ్ లో తొడ కండరాల గాయం కారణంగా అతడు తదుపరి మూడు మ్యాచులకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు అతడు అందుబాటులోకి వస్తాడని ముందే ప్రకటించినా గాయం తగ్గకపోవడంతో అలా  జరగలేదు. తాజాగా భువి గాయం నుండి  కోలుకున్నాడని....ఫిట్ నెస్ కూడా సాధించాడని సంజయ్ బంగర్ టీమిండియా అభిమానులకు తీపి కబురు అందించాడు. 

అయితే భువీ గాయంతో జట్టుకు  దూరమవడంతో మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. అయితే అతడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించి ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. దీంతో భువి గాయం నుండి కోలుకున్నా తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న అనుమానం అభిమానుల్లో ఏర్పడింది. అయితే చివరికి టీమిండియా మేనేజ్ మెంట్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 

బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్ లో మహ్మద్ షమీని ఆడిస్తూనే భువీకి కూడా అవకాశం కల్పించారు. అయితే ఇందుకోసం చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోంచి ఉద్వాసన పలికారు. అలాగే ఈ మ్యాచ్ లో కేదార్ జాదవ్ ను కూడా పక్కనబెట్టి దినేశ్ కార్తిక్ కు ఈ ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్ ఆడే అవకాశాన్నిచ్చారు..  

click me!