ప్రపంచ కప్ 2019: తన వివాదాస్పద ఔట్ పై రోహిత్ శర్మ స్పందనిదే...

By Arun Kumar PFirst Published Jun 28, 2019, 6:05 PM IST
Highlights

అది టీమిండియా, వెస్టిండిస్ ల మధ్య  మ్యాచ్. గతంలో పాకిస్థాన్ ను  చిత్తు చేసిన మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానమే ఈ మ్యాచ్ కూ వేదిక. ఇంకేముంది పాక్ పై సెంచరీతో చెలరేగినట్లే ఈ మ్యాచ్ లోనూ భారీ పరుగులు సాధించాలనుకుని బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్ రోహిత్  శర్మ ను దురదృష్టం వెంటాడింది. అంపైర్ల తప్పుడు నిర్ణయానికి అతడు బలికావాల్సి వచ్చింది. బంతి బ్యాట్ కు దూరంగా వెళుతున్నప్పటికి కేవలం స్పికోమీటర్లో స్పైక్స్ కనిపిండంతో థర్డ్ అంపైర్ రోహిత్ ను ఔట్ గా ప్రకటించాడు. దీంతో  ఈ నిర్ణయం వివాదాస్పదమయ్యింది.  

అయితే ఈ నిర్ణయంపై మైదానంలోనే తన అసంతృప్తిని వ్యక్తపర్చిన రోహిత్ మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తన వికెట్ కు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసిన రోహిత్ తల బాదుకుంటున్న(అయ్యో కర్మ అనే అర్థం వచ్చే), కళ్లు పెద్దవి చేసి చూసే ఎమోజీలను దానికి జతచేశాడు. ఇలా తన అసంతృప్తినంతా కేవలం ఒకే ఒక ట్వీట్ తో రోహిత్ వెల్లగక్కాడు. 

వెస్టిండిన్ బౌలర్ కీమర్ రోచ్ బౌలింగ్ లో రోహిత్ ఔటయిన విషయం తెలిసిందే. రోహిత్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్ చేస్తూ రోచ్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. బౌలర్ విసిరిన బంతి బ్యాట్ కు దూరంగా వెళ్లడం స్ఫష్టంగా కనిపిస్తున్నా కేవలం స్పికోమీటర్ ఆధారంగా రోహిత ను థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. మొదట ఆటగాళ్ల అప్పీల్ ను గ్రౌండ్ అంపైర్లు తోసిపుచ్చడంతో విండీస్ రివ్యూ కోరింది. దీంతో థర్డ్ అంపైర్ ఇలా వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించాడు.  

ఇలా అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయిన రోహిత్ మైదానంలోనే తన అసంతృప్తిని ప్రదర్శించాడు. తలను అడ్డంగా ఊపుకుంటూ నిరాశగా మైదానాన్ని వీడాడు. రోహిత్ భార్య కూడా ఈ  డిసిషన్ పై ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశారు. వీరే కాదు టీమిండియా మాజీలు, అభిమానులు సైతం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఏదైనా  నిర్ణయంపై ఓ క్లారిటీకి రానప్పుడు మైదానంలోని అంపైర్లు నిర్ణయానికి కట్టుబడి వుండాల్సింది. కానీ థర్డ్ అంపైర్ రోహిత్ వికెట్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించాడంటూ అభిమానులు మండిపడుతున్నారు. 
 
🤦‍♂️👀 pic.twitter.com/0RH6VeU6YB

— Rohit Sharma (@ImRo45)
click me!