నా కెరీర్ ను మలుపు తిప్పి... ప్రస్తుత సక్సెస్ కు కారణం ఆ సంఘటనలే : షమీ

By Arun Kumar PFirst Published Jun 28, 2019, 4:13 PM IST
Highlights

తొడ కండరాలు పట్టేయడంతో భువనేశ్వర్ కుమార్ భారత జట్టుకు దూరమవడంతో మహ్మద్ షమీకి అదృష్టం కలిసొచ్చింది. ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేక తొలి నాలుగు మ్యాచుల్లో షమీ డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాడు.అయితే పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ గాయపడటంతో తదుపరి మ్యాచుల్లో బరిలోకి దిగే అవకాశం షమీకి వచ్చింది. ఇలా అందివచ్చిన అవకాశాన్ని షమీ సద్వినియోగం చేసుకుని వరుసగా రెండు మ్యాచుల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. 
 
మొదట అప్ఘాన్, టీమిండియాల మధ్య జరిగిన మ్యాచ్ లో షమీ హ్యాట్రిక్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం వ్యక్తిగత రికార్డులను సాధించడమే కాదు జట్టును కూడా విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నిన్న(గురువారం) వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం షమీ తన సక్సెస్ గురించి మాట్లాడుతూ.... ఇలా క్రికెట్లో తాను రాటుదేలడానికి జీవితంలో చోటుచేసుకున్న రెండు సంఘటనలు కారణమయ్యాయని వెల్లడించాడు. 

ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితంలో గతకొన్ని నెలలుగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపాడు. అలాంటి  క్లిష్ట పరిస్థితుల్లో ఎంత మనోవేధనను అనుభవించానో మాటల్లో చెప్పలలేనని అన్నాడు. అదే సమయంలో తన కెరీర్లో కూడా  కొన్ని  సమస్యలు  ఎదురయ్యాయి. ఇలా వ్యక్తిగత, ప్రొపెషనల్ జీవితంలో ఎదురైన సమస్యలు తనను మరింత రాటుదేలేలా చేశాయని షమీ బయటపెట్టాడు. 

ముఖ్యంగా యోయో  టెస్ట్ లో విఫలమవడం తనకు మంచి  గుణపాఠాన్ని నేర్పిందని షమీ పేర్కొన్నాడు. అప్పటినుండే ఫిట్ నెస్ పై  ప్రత్యేకంగా దృష్టి పెడుతూ డైట్ ఫాలో అవుతున్నానని తెలిపాడు. దీంతో కాస్త బరువు తగ్గానని... తొందరగా అలసిపోకుండా ఎక్కువసేపు బౌలింగ్ చేయగలుగుతున్నానని అన్నాడు. ఇలా తనకు ఎదురైన సమస్యల నుండి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలే ప్రస్తుతం తన సక్సెస్ కారణమన్నాడు.  గత రెండు మ్యాచుల్లో తాను రాణించడానికి కూడా అవే కారణమని షమీ వెల్లడించాడు.       
 
click me!