శిఖర్ ధవన్ భారత జట్టులోనే... ఆ మ్యాచుల్లో ఆడతాడు: కోహ్లీ

By Arun Kumar PFirst Published Jun 14, 2019, 3:54 PM IST
Highlights

టీమిండియా  ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా టీమిండియా తుది జట్టులో మాత్రమే చచోటు కోల్పోయాడిని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. కాబట్టి అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడినెవరినీ తీసుకోలేదని...కానీ ముందుజాగ్రత్తలు మాత్రం తీసుకున్నామని వెల్లడించాడు. అందుకోసమే యువ క్రికెటర్ రిషబ్ పంత్ ను  టీం మేనేజ్ మెంట్ ఇంగ్లాండ్ కు రప్పించిందని...కానీ  ఆ అవసరం వస్తుందని తాను భావించడం లేదన్నారు. లీగ్ చివరి దశలో కానీ సెమీఫైనల్ మ్యాచులకు గానీ ధవన్ అందుబాటులోకి వస్తాడని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.   

న్యూజిలాండ్ తో  మ్యాచ్ రద్దయిన అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ముఖ్యంగా ధవన్ గాయంపై అభిమానుల్లో నెలకొనివున్న సందేహాలను నివృత్తిచేసే ప్రయత్నం చేశాడు. ఐసిసి టోర్నీలో చెలరేగే ధవన్ సేవలను వదులుకోడానికి భారత్ సిద్దంగా లేదన్నాడు. కాబట్టి అతడి గాయం విషయంలో వేచిచూసే ధోరణిని అనుసరిస్తున్నామని... అత్యవసరమైతే అతడి ఓపెనింగ్ సేవలను వినియోగించుకుంటామని తెలిపాడు. 

టీమిండియా గెలుపు కోసం ఏమైనా చేయాలన్న కసి ధవన్ లో కనిపిస్తుంది. ఆ కసే అతడిని ఈ గాయం నుండి  బయటపడేస్తుంది. ఇప్పటికే గాయాన్ని సైతం లెక్కచేయకుండా అతడు ఫిట్ నెస్ పై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. వైద్యుల పర్యవేక్షణలో  వున్న ధవన్ ఎప్పటికి కోలుకుంటాడు...మళ్లీ జట్టులో ఎప్పుడు చేరతాడన్న  క్లారిటి మరో 10-12 రోజుల్లో వస్తుందని  కోహ్లీ పేర్కొన్నాడు. 

కోహ్లీ చెప్పినట్లే ధవన్ జట్టుకు దూరమైనా ఫిట్ నెస్ ను కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి బయటకువచ్చింది. బొటనవేలి గాయంతో చేతిచుట్టూ కట్టు కట్టుకుని మరీ  ధవన్ జిమ్ లో  తెగ కసరత్తు చేస్తున్నాడు. చేతులతో చేసే వర్కౌట్లు తప్పిస్తే మిగతా అన్నింటిని యధావిదిగా చేస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది. గాయం నుండి కోలుకుని మళ్లీ జట్టులో చేరాలన్న కసి అతడిలో కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని కోహ్లీ కూడా వ్యక్తపర్చాడు. 

click me!