ఇదే నా చివరి వరల్డ్ కప్ కావచ్చు...ఇంకా ఆడాలని వున్నా...: బంగ్లా కెప్టెన్ సంచలనం

By Arun Kumar PFirst Published Jun 28, 2019, 2:01 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ ముగియగానే చాలామంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. విండీస్ హిట్టర్ క్రిస్ గేల్, టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఇలా చాలా మంది ఆటగాళ్ల కెరీర్ ఈ ప్రపంచ కప్ తర్వాత ముగియనుంది. అయితే ఈ రిటైర్మెంట్ లిస్ట్ లోకి అనూహ్యంగా ఓ కొత్త పేరు వచ్చి చేరింది. అతడే బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రఫే మోర్తజా. 
 
ఈ ప్రపంచ కప్ తర్వాత తాను ఖచ్చితంగా రిటైరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని మోర్తజా స్వయంగా తెలిపాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోర్తజా తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు. ఈ ప్రపంచ కప్ తర్వాత కూడా తన కెరీర్ కొనసాగిస్తానని...కానీ తదుపరి వరల్డ్ కప్ వరకు తాను జట్టులో వుండకపోవచ్చని పేర్కొన్నాడు. కాబట్టి తానాడే చివరి వరల్డ్ కప్ ఇదేనని మోర్తజా స్పష్టం చేశాడు. 

తాము ప్రస్తుతం సెమీస్ రేసులో వున్నాం కాబట్టి ఈ విషయంపై ఎక్కువగా చర్చించి గందరగోళాన్ని సృష్టించాలని అనుకోవడం లేదన్నాడు. అందువల్ల తన రిటైర్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడి నా సహచరులను భావోద్వేగానికి గురయ్యేలా చేయలేనని అన్నాడు. కాబట్టి ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతానని మోర్తజా వెల్లడించాడు. 

అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని బట్టి  తన రిటైర్మెంట్ వుంటుందని అన్నాడు. ఒకవేళ ఈ  మెగా టోర్నీ ముగిసిన వెంటనే వారు ఆ విధంగా ఆదేశిస్తే తాను అలాగే చేస్తానన్నాడు. అయితే మోర్తజా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జలాల్ యూనస్ స్పందించారు. రిటైర్మెంట్  నిర్ణయం మోర్తజా వ్యక్తిగతమని...అందుకోసం తమనుండి ఎలాంటి ఒత్తిడి అతడిపై  వుండదని ఆయన తెలిపాడు. 

click me!