నేను ప్రపంచ కప్ ఆడతానంటే మా క్రికెట్ బోర్ట్ వద్దంటోంది: డివిలియర్స్

By Arun Kumar PFirst Published Jun 7, 2019, 2:11 PM IST
Highlights

ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో పసికూనలు అప్ఘాన్, బంగ్లాదేశ్ లు కూడా అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నాయి. కానీ దక్షిణాఫ్రికా వంటి  బలమైన జట్టు వీటికంటే చెత్త ఆటతీరుతో వరుస ఓటములను మూటగట్టుకుంటోంది. సమఉజ్జీలు ఇంగ్లాండ్, భారత్ చేతిలో ఓడితే పరవాలేదు కాదు బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓటమిని చవిచూసి సౌతాఫ్రికా తీవ్ర విమర్శలపాలవుతోంది. ఇలా ఆ జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్న సమయంలో సీఎస్‌ఎ ( క్రికెట్ సౌతాఫ్రికా) ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. 

దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబి డివిలియర్స్ కొద్దిరోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.  అయితే ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ టోర్నీలో జట్టుకు తన సేవలు అవసరమున్నాయని అతడు భావించాడట. దీంతో రిటైర్మెంట్ ను పక్కనపెట్టి అతడే స్వయంగా సీఎస్ఎ ను కోరాడట. ఈ నెల 21న తన ప్రతిపాదనను డివిలియయర్స్ తమ దేశ క్రికెట్ బోర్డు ముందుంచాడు. 

 డివిలియర్స్ అభ్యర్థనను కెప్టెన్ డుప్లెసిస్, కోచ్ గిబ్సన్ లు కూడా అంగీకరించారు. కానీ తాము మాత్రం  దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సీఎస్ఎ అధికారులు తెలిపారు.  ఎందుకంటే గతంలో తాము వద్దని వారించినా అతడు అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలిగాడని...ఇప్పుడు మళ్లీ అతడిని జట్టులోకి తీసుకుంటే సమస్యలు తలెత్తే అవకాశం వున్నాయన్నారు. అందువల్లే అతడికి ప్రపంచ కప్ లో ఆడే అవకాశం ఇవ్వలేదని సిఎస్ఎ వెల్లడించింది. 

ప్రపంచ కప్ సీజన్ 12 ఆరంభమ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ తో చేతిలో పరాజయం నుండి సౌతాఫ్రికా ఓటముల పరంపర మొదలయ్యింది. ఆ తర్వాత పసికూన బంగ్లాదేశ్, భారత్ చేతిలో వరుసగా ఓటమిని చవిచూసింది. ఇలా జట్టు ఇబ్బందులు పడుతున్న సమయంలో క్రికెట్ సౌతాఫ్రికా ఈ విషయాన్ని బయటపెట్టిన సంచలనం రేపింది.  

click me!