ఆసిస్ బౌలర్లు వికెట్లు పడగొడుతున్నా కంగారొద్దు: కోహ్లీ సేనకు సచిన్ సలహాలు

By Arun Kumar PFirst Published Jun 6, 2019, 9:11 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియాకు శుభారంభం లభించింది. గత బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అన్ని  విభాగాల్లో ఆధిక్యం ప్రదర్శించారు. మొదట బౌలింగ్, ఫీల్డింగ్ ఆ తర్వాత బ్యాటింగ్ లో ఆదరగొట్టడంతో సఫారీ జట్టును చిత్తు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయంతో మంచి ఊపుమీదున్న టీమిండియా తర్వాతి మ్యాచ్ పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత ఆటగాళ్లకు కొన్ని సలహాలు, సూచనలు చేశాడు. 

ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్ లు పాస్ట్ బౌలర్లకు చాలా అనుకూలిస్తాయి. కాబట్టి అత్యుత్తమ సీమర్లను కలిగిన ఆస్ట్రేలియా జట్టు మన బ్యాట్ మెన్స్ పై ఆధిక్యాన్ని కనబర్చవచ్చు. కాబట్టి వరుసగా వికెట్లు కోల్పోతున్నా భారత జట్టు కంగారు పడిపోయి ఒత్తిడికి లోనవ్వొద్దని సలహా ఇచ్చాడు. ఎందుకంటే ఆ జట్టుకు ఎంత పటిష్టమైన బౌలింగ్ విబాగముందో అంతకంటే గొప్ప బౌలర్లు మన జట్టులోనూ వున్నారన్నారు. కాబట్టి ఆసిస్ బ్యాట్ మెన్స్ ను కూడా భారత బౌలర్లు కట్టడిచేయగలరని సచిన్ పేర్కొన్నాడు. 

ఆసిస్ బ్యాటింగ్ విషయానికి వస్తే డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ తిరిగి జట్టులో చేరడంతో ఆ జట్టుకు అదనపు బలమన్నారు. ముఖ్యంగా వార్నర్‌ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. కాబట్టి ప్రపంచ కప్ లోనూ అదే ఆటతీరు కనబర్చవచ్చు. అందువల్ల అతడి విషయంలో జాగ్రత్తగా లేకుంటే చాలా ప్రమాదకరంగా మారతాడని తెలిపాడు. కాబట్టి అతడి విషయంలో జాగ్రత్తగా వుండాలని సచిన్ సూచించాడు. 
  
click me!