పాకిస్థాన్-సౌతాఫ్రికా మ్యాచ్: ఇమ్రాన్ తాహిర్ అరుదైన రికార్డు నమోదు

Published : Jun 23, 2019, 07:24 PM IST
పాకిస్థాన్-సౌతాఫ్రికా మ్యాచ్:  ఇమ్రాన్ తాహిర్ అరుదైన రికార్డు నమోదు

సారాంశం

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో సౌతాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టిన అతడు ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన సౌతాఫ్రికా బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మాజీ సఫారీ ప్లేయర్ అలెన్ డొనాల్డ్ పేరిట వుండగా దాన్ని తాహిర్ బద్దలుగొట్టాడు. 

పాకిస్థాన్ ఓపెనర్లిద్దరిని పెవిలియన్ కు పంపించడం ద్వారా తాహిర్ ఖాతాలోకి 39 వరల్డ్ కప్ వికెట్లు చేరాయి. ఇలా ప్రపంచ కప్ ఆరంభం నుండి ఇప్పటివరకు ఓ  దక్షిణాఫ్రికా బౌలర్ సాధించిన అత్యధిక వికెట్లు ఇవే కావడం విశేషం. అంతకుముందు అలెన్ డొనాల్డ్  38 వికెట్లతో టాప్ లో వుండేవాడు. ఆ  రికార్డును తాహిర్ తాజాగా ప్రదర్శనతో బద్దలుగొట్టాడు. 

పాక్ ఓపెనర్ ఫకార్ ను ఔట్ చేయడం ద్వారా డొనాల్డ్ రికార్డును తాహిర్ సమం చేశాడు. ఆ తర్వాత ఇమామ్ ను కూడా తాహిరే ఔట్ చేయడంతో ఆ రికార్డు కాస్తా బద్దలయ్యింది. ఇలా ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్ గా తాహిర్ రికార్డు నెలకొల్పాడు. 

PREV
click me!

Recommended Stories

రాయుడిని కాదని మయాంక్ ను ఎందుకు ఎంపిక చేశామంటే: ఎమ్మెస్కే ప్రసాద్
ప్రపంచ కప్ ఓటమి ఎఫెక్ట్: శ్రీలంక జట్టులో ప్రక్షాళన షురూ...ముందుగా వారిపైనే వేటు...?