ప్రపంచ కప్ 2019: షమీకి ముందే చెప్పా... హ్యాట్రిక్ ప్రదర్శనపై సచిన్ కామెంట్స్

By Arun Kumar PFirst Published Jun 23, 2019, 5:10 PM IST
Highlights

పసికూన అప్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి అంచుల్లో నిలిచిన టీమిండియాను ఫేసర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో గట్టెక్కించిన విషయం తెలిసిందే. చివరి ఓవర్లో వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ ప్రదర్శన చేశాడు. ఇలా కీలక సమయంలో జట్టును ఆదుకుని గెలిపించిన అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులే కాదు క్రికెట్ దిగ్గజాలు సైతం షమీ బౌలింగ్ ను కొనియాడుతున్నారు. ఇలా తాజాగా టీమిండియా లెజెండరీ  క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా షమీని అభినందించారు. 

తాను ముందునుండే షమీ బౌలింగ్ పై అపారమైన నమ్మకంతో వున్నానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు షమీతో కూడా చెప్పినట్లు తెలిపారు. తనదైన  రోజు ఎంతటి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టునయినా కుప్పకూల్చగల సత్తా అతడి సొంతమన్నాడు. కానీ ప్రతిదానికి  టైం రావాలని... ఆ టైం త్వరలోనే వస్తుందని షమీకి గతంలోనే చెప్పినట్టు సచిన్ తెలిపారు. 

 భారత ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న షమీకి గత నాలుగు మ్యాచుల్లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో నిరాశ చెందిన షమీని తాను ఇటీవలే కలుసుకుని మాట్లాడినట్లు సచిన్ తెలిపారు. అయితే త్వరలోనే నీకు టైం వస్తుందని... అదరగొట్టడానికి సిద్దంగా వుండాలని సూచించానని వెల్లడించారు. తాను అన్నట్లుగానే భువనేశ్వర్ గాయం కారణంగా తుది జట్టులో చోటు కోల్పోడంతో షమీ జట్టులోకి వచ్చాడని గుర్తుచేశారరు. ఇలా వస్తూనే హ్యాట్రిక్ ప్రదర్శనతో అదరగొట్టడంతో పాటు టీమిండియాను విజయతీరాలకు చేర్చాడంటూ షమీని  సచిన్ కొనియాడారు.   
 
click me!