ప్రపంచ కప్ 2019: పాక్ మాజీ ఆటగాళ్లపై సర్ఫరాజ్ సీరియస్... ఘాటు విమర్శలు

By Arun Kumar PFirst Published Jun 23, 2019, 3:33 PM IST
Highlights

టీమిండియా చేతిలో ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఓటమిపాలవడంతో పాకిస్థాన్ టీం, ఆటగాళ్లు తీవ్ర విమర్శలపాలయ్యారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ విమర్శించడానికి ప్రతి ఒక్కరికి టార్గెట్ మారిపోయాడు. కొందరు అభిమానులయితే అతడి ఎదురుగానే అసభ్యంగా దూషించారు. టాస్ పై అతడు తీసుకున్న నిర్ణయం, మైదానంలో కదలికలు, బ్యాటింగ్ వైఫల్యం ఇలా అన్నింటిలోనూ సర్ఫరాజ్ ను తప్పుబడుతూ కొందరు పాక్ మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర విమర్శలు  చేశారు. వారికి తాజాగా సర్ఫరాజ్ తనదైన స్టైల్లో ఘాటుగా జవాభిచ్చాడు.  

''మాజీలు తమను క్రికెటర్లుగా గుర్తించడానికే ఇష్టపడటం లేదు. అందువల్లే ఓడిన ప్రతిసారీ  తమను విమర్శిస్తూ మరింత ఒత్తిడిలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మేం  విజయాలు అందుకుంటున్న సమయంలో మాత్రం వారికి మాటలు రావు. వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన మాజీలే కాలుపట్టి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. వారిప్పుడు  టీవి చర్చల పాల్గొంటూ తామేదో దేవుళ్లమన్నట్టుగా మ్యాచ్ లపై అనలసిస్ చేస్తున్నారు'' అంటూ ఘాటుగా చురకలు అంటించాడు. 

ఇక అభిమానుల విమర్శలపై సర్ఫరాజ్ స్పందిస్తూ...సద్విమర్శ చేస్తే మేం మా తప్పులు సరిదిద్దుకోడానికి సిద్దంగా వుంటామన్నాడు. కానీ అలా కాకుండా మా  వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ దాన్ని మ్యాచ్ ఫలితంతో లింక్ చేయడం సరికాదన్నాడు. సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు అసభ్య పదజాలంతో మేసేజ్ లు చేస్తున్నారని...అలాంటి చేష్టలను మానుకోవాలని సూచించాడు. భారత జట్టు చేతిలో ఓటమి తర్వాత వున్న పరిస్థితులు ఇప్పుడు లేవని...తాము ప్రస్తుతం తదుపరి మ్యాచుల గురించే ఆలోచిస్తున్నామని సర్ఫరాజ్ వెల్లడించాడు. 

click me!