షమీ హ్యాట్రిక్ వెనుక వ్యూహకర్త ఎవరో తెలుసా...?

By Arun Kumar PFirst Published Jun 23, 2019, 2:22 PM IST
Highlights

అది ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నీ...వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను పసికూన అప్ఘానిస్తాన్ బెంబేలెత్తిస్తున్న సమయమది. చివరి ఓవర్లో  అప్ఘాన్ విజయానికి 16 పరుగులు అవసరమవగా మంచి జోరుమీదున్న నబీ(48 పరుగులతో) బ్యాటింగ్ చేస్తున్నాడు.ఇలాంటి కీలక సమయంలో బంతిని అందుకున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మాయ చేశాడు. నబితో సహా చివరి మూడు వికెట్లు వరుస బంతుల్లో (హ్యాట్రిక్) పడగొట్టి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. అయితే షమీ హ్యాట్రిక్ వెనుక మరో మాస్టర్ బ్రేయిన్ పనిచేసింది. అతడే మహేంద్ర సింగ్ ధోని.  

శనివారం సౌతాంప్టన్ వేదికన జరిగిన మ్యాచ్ అప్ఘానిస్తాన్ జట్టు టీమిండియాను దాదాపు ఓడించినంత పని చేసింది. మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ తోనూ ఆకట్టుకున్న ఆ జట్టు భారత ఆటగాళ్ళకు ముచ్చెమటలు పట్టించింది. మొదట టీమిండియాను 224 పరుగులకే పరిమితం చేసి అప్ఘాన్ బౌలర్లు సత్తా చాటారు.  ఆ తర్వాత కూడా సమయోచిత  బ్యాటింగ్ తో ఆకట్టుకుంది. అయితే చివరి ఓవర్లో షమీ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి సత్తా చాటడంతో టీమిండియా  11 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 

చివరి ఓవర్లో అప్ఘాన్ గెలుపుకు 16 పరుగులు అవసరమున్న సమయంలో కెప్టెన్ కోహ్లీ షమీకి బంతిని అందించాడు. అయితే అప్పటికే చక్కని షాట్లతో అలరిస్తూ క్రీజులో కుదురుకున్న నబి షమీని ఎదుర్కోడానికి  సితద్దమయ్యాడు. అయితే షమీ వేసిన తొలి బంతికే నబి ఫోర్ కొట్టడంతో లక్ష్యం ఐదు బంతుల్లో  12 పరుగులకు మారింది.    

ఆ  సమయంలోని ధోని బౌలర్ షమీ వద్దకు వెళ్లి ఏదో సలహా ఇచ్చాడు. ఈ సలహా తర్వాత షమీ బౌలింగ్ లో మార్పు వచ్చింది. రెండో బంతికి పరుగులేమీ ఇవ్వకుండా  మూడు, నాలుగు. ఐదు బంతుల్లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. అంతేకాకుండా ఈ అద్భుత ప్రదర్శనతో అప్ఘాన్ 213 పరుగులకే  ఆలౌటయ్యింది. దీంతో 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 

ఇలా చివరి  ఓవర్లో షమీ హ్యాట్రిక్ వికెట్ల వెనుక ధోని మాస్టర్ బ్రెయిన్ పనిచేసిందన్నమాట. ఇదే అంశం ఇప్పుడు  క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. '' హ్యాట్రిక్ తీసిన వాడు షమీనే అయినా తీయించిన వాడు ధోని'' అంటూ అభిమానులు ఆ హ్యాట్రిక్ క్రెడిట్ ను ధోనికి ఇస్తున్నారు. 

click me!