మా నుండి మ్యాచ్ లాక్కున్నది వాళ్లే...ఎంగిడి వుండుంటే : డుప్లెసిస్

By Arun Kumar PFirst Published Jun 6, 2019, 7:35 PM IST
Highlights

ప్రపంచ కప్ లో వరుస ఓటములతో సతమతమవుతున్న దక్షిణాఫ్రికా జట్టు టీమిండియా చేతిలో మరో ఘోర ఓటమిని చవిచూసింది. భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ చివరకు ఫీల్డింగ్ లోనూ అదరగొట్టడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. అయితే తమను మాత్రం ఓడించింది టీమిండియా బౌలర్లేనని సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు. వారు మొదటి ఇన్నింగ్స్ ద్వారానే మా చేతుల్లోంచి మ్యాచ్ ను లాక్కున్నారని అతడు పేర్కొన్నాడు. 
 
ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ సీజన్ 12లో టీమిండియా మొదటి మ్యాచ్ లోనే అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 228 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలుండగానే భారత జట్టు ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ మాట్లాడుతూ...టీమిండియా అద్భుతమైన బౌలింగ్ విభాగాన్ని కలిగివుందని పేర్కొన్నాడు. 

భారత బౌలర్లు మ్యాచ్ ఆరంభం నుండి తమ బ్యాట్ మెన్స్ అటాకింగ్ దిగి ఒత్తిడిలోకి నెట్టారన్నారు. వారి వ్యూహం ఫలించి తాము వెంటవెంటనే వికెట్లు కోల్పోయామన్నారు. ఒక్కసారిగా టాప్ ఆర్డర్ విఫలమవడంతో తర్వాత వచ్చే బ్యాట్ మెన్స్ పై ఒత్తిడి పెరిగిందని...అందువల్ల వారు కూడా ఆత్మవిశ్వాసంతో ఆడలేకపోయారని వివరించాడు. ఇలా నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లతో భారత బౌలింగ్ విభాగం అద్భుతంగా వుందని ప్రశంసించాడు. 

ఇక తమ జట్టు ఓటమికి మరో కారణం కీలక బౌలర్లు జట్టుకు దూరమవడమని డుప్లెసిస్ తెలిపాడు. ముఖ్యంగా లుంగి ఎంగిడి ఈ మ్యాచ్ లో వుండుంటే తాము కూడా భారత బ్యాట్ మెన్స్ పై అటాకింగ్ చేసేవాళ్లమన్నాడు. అయినప్పటికి మొర్రిస్, రబడ అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. అయితే కాపాడుకోవాల్సిన లక్ష్యం తక్కువగా వుండటంతో వాళ్లు కూడా ఏం చేయలేకపోయారని డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. 

click me!