ప్రపంచ కప్ 2019: సహచరులకు పాక్ కెప్టెన్ సీరియస్ వార్నింగ్... టీమిండియాపై భయంతో

By Arun Kumar PFirst Published Jun 13, 2019, 5:02 PM IST
Highlights

ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ మరో ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. నిన్న(బుధవారం)   ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పాక్ 41 పరుగుల తేడాతో పరాజయంపాలయ్యింది. ఇలా భారత్ తో మ్యాచ్ కు ముందు చవిచూసిన ఈ ఓటమిని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సీరియస్ గా  తీసుకున్నట్లున్నాడు. అందువల్లే పాక్ ఓటమిని సమీక్షించుకుని తాము ఎక్కడ తప్పు చేశామో గుర్తించాడు. ఈ పొరపాట్లు భారత్ పై జరిగే మ్యాచ్ లో పునరావృతం చేయవద్దంటూ సహచర ఆటగాళ్లకు సర్ఫరాజ్ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడట. 
 
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఫేలవ ఫీల్డింగే తమ కొంప ముంచిందని సర్ఫరాజ్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఆసిస్ ఓపెనింగ్ జోడీ ఫించ్, వార్న ర్ లను పలుమార్లు ఔట్ చేసే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం  చేసుకోలేకపోయామని గుర్తుచేశారు. మొత్తంగా ఈ మ్యాచ్ లో మూడు క్యాచులను తాము చేజార్చుకున్నట్లు...అదే ఫలితంపై ప్రభావం చూపించిందని పాక్ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.

అందువల్ల ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఈ ఆదివారం(జూన్ 16) భారత్ తో జరిగే మ్యాచ్ ఆ తప్పులు పునరావృతం చేయకుండా జాగ్రత్తపడతామన్నాడు. ఆస్ట్రేలియా, భారత్ వంటి పెద్ద జట్లతో ఆడేటపుడు  మైదానంలో ఫీల్డర్లు మరింత చురుగ్గా వుండాలని... కాబట్టి తాము తదుపరి మ్యాచ్ కోసం ఫీల్డింగ్ పై ప్రత్యేక దృష్టి పెడతామన్నాడు. కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా వున్నపుడే పెద్ద జట్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. 

టీమిండియాతో జరగనున్న మ్యాచ్ లో సమిష్టిగా ఆడుతూ అన్ని విభాగాల్లో రాణించడానికి ప్రయత్నిస్తామని అన్నాడు.  అందుకోసం ఆ మ్యాచ్ కు ముందే తమ తప్పులను సరిదిద్దుకుంటామన్నాడు. ఆసిస్ పై మ్యాచ్ లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటే టీమిండియాపై పైచేయి తమదేనని సర్ఫరాజ్ ధీమా వ్యక్తం చేశాడు. 

ఈ ప్రపంచ కప్ లో పాక్ జట్టు నిలకడలేమి స్ఫష్టంగా కనిపిస్తోంది. వార్మప్ మ్యాచ్ లో పసికూన అప్ఘాన్ చేతిలో ఓటమిపాలై పాక్ అసలు ఈ మెగా టోర్నీలో కనీస పోటీని ఇస్తుందా  అన్న అనుమానాన్ని రేకెత్తించింది. అందుకు తగ్గట్లుగానే మొదటి మ్యాచ్ లోనే వెస్టిండిస్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో ఇక పాక్ పని అయిపోయిందని అనుకుంటున్న సమయంలోనే ఆతిథ్య ఇంగ్లాండ్ ను ఓడించి సంచలనం సృష్టించింది. ఇలా మంచి ఊపుమీదున్నట్లుగా కనిపించి తాజా మళ్లీ ఆసిస్ చేతిలో ఓడింది. ఇలా నిలకడలేమితో సతమతమవుతున్న ఆ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ను సమర్థవంతంగా ఎదుర్కోవడం చాలా కష్టమైనా పని. అయితే తాము మాత్రం  భారత జట్టుకు గట్టి పోటీ ఇస్తామని పాక్ కెప్టెన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 

click me!