ప్రపంచ కప్ ఫైనల్ కు టీమిండియా... ప్రత్యర్థి జట్టేదంటే: గూగుల్ సీఈవో సుందర్

By Arun Kumar PFirst Published Jun 13, 2019, 4:04 PM IST
Highlights

ఐసిసి వన్డే ప్రపంచ కప్... ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో విజయం సాధించి ట్రోపిని అందుకోవాలని ప్రతి జట్టు ఉవ్విళ్లూరుతుంది. కానీ ఏదో ఒక జట్టు మాత్రమే దాన్ని  అందుకుని విశ్వవిజేతగా నిలుస్తుంది. అలా ఈసారి ప్రపంచ విజేతగా భారత్ నిలవనుందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జోస్యం చెప్పారు. 

అయితే భారత సంతతికి చెందిన  వ్యక్తిని కావడంవల్ల కోహ్లీ సేనపై అభిమానంలో ఇలా చెప్పడం లేదని సుందర్ అన్నాడు. ప్రస్తుతం జట్ల బలాబలాలు, ఇప్పటివరకు జరిగిన మ్యాచులను పరిశీలించి  ఈ విషయాన్ని  చెప్పానని వివరించాడు. కానీ టీమిండియాకు అంతగా ఈజీగా ట్రోపీని ఎగరేసుకుపోతుందని అనుకోవడం లేదని... మిగతా జట్ల నుండి కూడా మిక్కిలి పోటీ వుంటుందన్నారు. వాటన్నింటిని దాటుకుని భారత జట్టు  ముందుకెళుతూ విజయాన్ని అందుకుంటుందని సుందర్ పేర్కొన్నారు. 

ప్రపంచ కప్  ఫైనల్లో మాత్రం ఆతిథ్య ఇంగ్లాండ్ తోనే టీమిండియా పోటీ పడుతుందని ఆయన తెలిపారు. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయని...అయితే నిలకడగా విజయాలు సాధించడంలో విఫలమవుతున్నాయని పేర్కొన్నాడు. కాబట్టి సెమీ ఫైనల్ వరకు ఈ రెండు జట్లు చేరుకున్న ఫైనల్ మాత్రం కోహ్లీ, మోర్గాన్ సేనల మధ్యే  జరుగుతుందని సుందర్ వెల్లడించారు. 

click me!