ఆ ఆవలింత నాకు సంతోషాన్నిచ్చింది...ఎలాగంటే: పాక్ కెప్టెన్ సర్ఫరాజ్

By Arun Kumar PFirst Published Jun 23, 2019, 8:04 PM IST
Highlights

అది ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ టోర్నీ... అందులోనూ వారు తలపడేది చిరకాల ప్రత్యర్థితో. అలాంటి మ్యాచ్ లో ఏ చిన్న పొరపాటు దొర్లకుండా కనురెప్ప వాల్చకుండా జాగ్రత్తగా వుండాలి. కానీ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఏకంగా మైదానంలోనే నిద్రమత్తులో వున్నట్లు  ఆవలింతలు తీయడం తీవ్ర దుమారం రేపింది.  

అతడలా ప్రవర్తించడం...పాక్ భారత్ చేతిలో ఓడిపోవడం ఒకే మ్యాచ్ లో జరగడంతో అభిమానులు సర్ఫరాజ్ ను ఓ ఆటాడుకున్నారు. అతడి అవలింతకు సంబంధిచిన ఫోటోతో వివిధ రకాల మీమ్స్, సెటైరికల్ ఫోటోలు, వీడియోలు తయారుచేసి దానికి తమదైన కామెంట్స్ జతచేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో సర్ఫరాజ్ ఆవలింత ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. 

అయితే తాజాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు ముందు సర్ఫరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆవలింత గురించి స్పందించాడు. సహజంగా వచ్చిన ఆవలింతను పట్టుకుని తానేదో నేరం చేసినట్లు కొందరు నానా హంగామా చేశారని అన్నాడు. ముఖ్యంగా మీడియా సంస్థలు, సోషల్ మీడియా మాధ్యమాలు, కొందరు వ్యక్తులు ఆ ఫోటోను ఉపయోగించుకుని డబ్బులు సంపాదించాలనుకున్నాయి. సంపాదించాయి కూడా. అలా వారు బాగుపడేందుకు నా ఆవలింత ఉపయోగపడినందుకు సంతోషంగా వుందని సర్ఫరాజ్ అన్నారు. 

టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా మైదానంలో తాను సహజంగానే ఆవలించానని...అజాగ్రత్తగా మాత్రం లేనని సర్ఫరాజ్ స్ఫష్టం చేశాడు. కానీ తానేదో తప్పు చేసినట్లు కొందరు తనపై కావాలనే దుష్ర్పచారం చేసి పబ్బం గడుపుకోడానికి ఆ ఫోటోను వాడుకున్నారంటూ ఆగ్రహం  వ్యక్తం చేశాడు. ఎక్కడున్నాం...ఏం చేస్తున్నామన్న విషయాలను చూసి ఆవలింత రాదని...ఎవరికి అది వచ్చినా అందరూ నాలాగే చేస్తారని సర్పరాజ్ వివరించాడు. 

click me!